Global Warming In Telugu | Druvitha Science
ఈ భూమండలంపై రోజులు గడిచేకొద్ది వాతావరణంలో
ఉష్ణోగ్రతలు పెరుతూనే ఉన్నాయి ఈ ప్రభావాని అడ్డుకోకపోతే అతి తక్కువ కాలంలో సమస్త
ప్రాణులు అంతరించిపోయే అవకాశలు అధికంగా ఉన్నాయి. దీనికి ముఖ్య కారణం భూతాపం
(Global Warming). ఈ భూతాపం గురించి తెలుసుకోవాలంటే హరిత గృహ నిర్మాణం దాని
పనితీరు గురించి కొంత అవగాహన ఉండాలి.
హరిత గృహం అంటే ఏమిటి?
మొక్కలను అనువైనా పరిస్థితులలో లేదా వాతావరణాన్ని
కలిపించి పెంచడం కోసం గాజు వంటి పారదర్శకంగా ఉండే పదార్థాలతో పైకప్పు మరియు గోడలను
నిర్మిస్తారు. దీని గుండా లోపలికి కాంతి ప్రసారం అవుతుంది. లోపల వేడి వాతావరణం
ఏర్పడుతుంది. (శీతాకాలంలో కుడా వేడి ఉంటుంది) ఆ వేడి తిరిగి ఉద్గారం చెందకుండా ఈ
నిర్మాణం అడ్డుకుంటుంది. అంటే కొంత వేడి లోపలనే బందించబడి ఉంటుంది. ఇది మొక్కల
జీవక్రియలకు ఉపయోగపడుతుంది. ఈ నిర్మాణంలో ఆకుపచ్చని మొక్కలను పెంచడం వలన దీనిని
హరిత గృహం అని అంటారు.
ఇక్కడ హరిత గృహం చేస్తున్న పని వాతావరణంలోని కార్బన్
డై ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, మీథేన్, క్లోరో ఫ్లోరో కార్బన్లు మరియు హైడ్రో
క్లోరో ఫ్లోరో కార్బన్లు మొదలైన వాయువులు కలిసి భూమి చుట్టూ ఒక రక్షణ కవచం
ఏర్పరచుకున్నాయి. వీటినే హరిత గృహ వాయువులు (Green House Gases) అని అంటారు.
పగటిపూట సూర్యకిరణాల ద్వారా భూమి వేడెక్కుతుంది. తిరిగి రాత్రి సమయంలో ఆ వేడి
వాతావరణంలోకి ఉద్గారం చెందడం వలన భూఉపరితలం చల్లబడం జరుగుతుంది. ఇక్కడ ఉద్గారమయ్యే
వేడిని పూర్తిగా వాతావరణంలో కలవకుండా ఈ హరిత గృహ వాయువులు కొంత వేడిని
అడ్డుకుంటాయి. దీని వలన భూఉపరితల ఉష్ణోగ్రత సుమారు 59
ఉంటుంది.
ఇది జీవుల జీవక్రియలకు ఉపయోగపడుతుంది. లేదంటే జీవుల మనుగడకు ప్రమాదం జరుగుతుంది.
ఎందుకంటే హరిత గృహ వాయువులు వేడిని అడ్డుకోకపోతే ఉష్ణోగ్రతల స్థాయి సున్నా
డిగ్రీలకు పడిపోతుంది అప్పుడు భూఉపరితలం మంచుతో కప్పబడుతుంది.
We are in danger of destroying ourselves by our greed and
stupidity. We cannot remain looking inwards at ourselves on a small and
increasingly polluted and overcrowded planet. -Stephen Hawking
ఇంతవరకు బాగానే ఉంది కదా! మరీ భూతాపం ఎలా
పెరుగుతుంది? అనే ప్రశ్న మీలో ఏర్పడిందా? దానికి సమాదానం చూద్దాం
భూతాపం పెరగడానికి ప్రధాన కారణం బొగ్గు నుండి
విద్యుత్ ఉత్పత్తి
(Thermal Power Plant)
చేయడం. ఈ ఉత్పత్తి ద్వారా అధికంగా
వాతావరణంలోకి కర్బన వాయువులు విడుదలవుతున్నాయి. అలాగే శిలాజ ఇందనాలు మండించడం,
పరిశ్రమలు మరియు వాహనాలు విడుదలచేసే విషవాయువులు వాతావరణంలో కలుస్తునాయి. వీటితో
పాటు ఏసి, రిఫ్రిజిరేటర్స్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల నుండి కుడా వెలువడుతున్నయి. దీని వలన హరిత గృహ వాయువుల
( కార్బన్ డై ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, మీథేన్, క్లోరో ఫ్లోరో కార్బన్లు మరియు
హైడ్రో క్లోరో ఫ్లోరో కార్బన్లు మొ..) (Green House Gases) స్థాయి రోజు రోజుకి
పెరుగడం వల్ల ఎక్కువ వేడిని అడ్డుకుంటున్నాయి అందువలన భూతాపం (Global Warming) కుడా పెరుగుతుంది. దీనినే హరిత గృహ
ప్రభావం (Green House Effect) అంటారు.
భూతాపం వలన కలిగే నష్టాలు
భూతాపం పెరగడం వలన ఋతువులు (Seasons) గతి తారుమారవుతుంది. ప్రతి రోజు వేసవి కాలాన్ని
తలపిస్తుంది. మంచుకొండలు కరిగి వరదలు, తుఫానులు మరియు సునామీలు సంభవిస్తాయి. దీని
వలన సముద్రమట్టము పెరిగి తీర ప్రాంతాలు నీట మునుగుతాయి. దృవప్రాంతాలలో నివసించే
జీవజాతులు అంతరిచిపోతాయి మరియు సముద్రతీర ప్రాంతాలలో ఉండే మాంగ్రూవ్ అడవులలో ఉండే
జీవులు కుడా ప్రాణాలు కోల్పోతాయి. అలాగే అడవులలో నివసించే అనేక జీవజాతులు నశిస్తాయి.
కార్బన్ డై ఆక్సైడ్ నీటిలో పెరగడం వల్ల సముద్ర జీవులకు (Aquatic Animals) కావలసినంత ఆక్సిజన్ లభించక చనిపోతాయి. ఫలితంగా
జీవవైవిద్యం
(Biodivesity) దెబ్బతింటుంది.
ఇదే జరుగుతే ఆహారపు గొలుసులో
( Food Chain) అనేక
మార్పులు ఏర్పడతాయి.
ఈ భూతాపం రోజు రోజుకి ఎక్కువైతే 2050 నాటికి దాదాపు పది లక్షలకు పైగా వివిధ రకాల
జీవులు అంతరించిపోయే ప్రమాదం ఉందని నిపుణుల అంచన.
Climate change is a terrible problem, and it absolutely needs to
be solved. It deserves to be a huge priority. -Bill Gates
అదే విధంగా వాతావరణంలో అనేక మార్పులు
సంభవిస్తాయి. ఉష్ణమండల ప్రాంతాలకు పరిమితమైన వ్యాధులు భూమండలం అంత వ్యాపిస్తాయి.
అసాదారణ ఉష్ణోగ్రతలు పెరగడం వలన వడగాలుల ప్రభావం ఎక్కువ అవుతుంది. ఇది సమస్త జీవుల
ప్రాణాలకు నష్టం కలిగిస్తుంది. వర్షాలు పడకపోవడం వలన నీటి కరువు ఏర్పడుతుంది.
వ్యవసాయ ఉత్పత్తులు తగ్గడం వల్ల ఆహారపు కొరత అధికమవుతుంది. రోజు రోజుకి వనరుల లభ్యత
తగ్గి కరువు కాటకాలు, ఆకలితో అలమటించడం మరియు వలసలు (Migrations) అధికమవడం జరుగుతుంది. వనరుల కోసం దేశాల మధ్య యుద్దాలు కుడా జరగవచ్చు.
చివరికి ఈ భూమండలం ఎడారిలా మారుతుంది అని అనడంలో సందేహం లేదు.
భూతాపాన్ని ఎలా తగ్గించాలి?
బొగ్గు నుండి విద్యుత్ ఉత్పత్తిని (Thermal Power Plant) తగ్గించి సౌరశక్తి ( Solar Energy) మరియు పవనశక్తి (Wind Energy) మరియు సాగర శక్తి (Tidal Energy) వినియోగాన్ని ప్రోత్సహించాలి. వీలైనంత వరకు శిలాజ ఇంధన వాడకాన్ని
తగ్గించడం ద్వారా ఈ భూమండలాన్ని కొంత వరకు రక్షించవచ్చు. పరిశ్రమల నుండి
విడుదలయ్యే వాయువులను తగ్గించడం, అవసరాలకు మించి వాహనాలను వినియోగించడం
అడ్డుకోవాలి. అధికంగా మొక్కలను నాటి అడవులను రక్షించాలి. కఠినమైన చట్టాలను
తిసుకొచ్చి ప్రజలలో చైతన్యం కలిగించాలి.
ఇది వినడానికి – చూడడానికి చాలా చిన్నగా ఉన్న ఏదో ఒకరోజు దీని (భూతాపం)
ప్రభావం మాత్రం మనపై చాల తీవ్రంగా పడుతుంది.
గమనిక :
- సైన్స్ కి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఉంటే రాసి పంపండి. మీ పేరుతో ప్రచురణ చేస్తాం.
- మేము ప్రచురుణ చేసే వాటిలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని మాకు తెలియజేయండి. అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాము. మాకు మీ సలహాలు – సూచనలు అవసరం.
మరిన్ని వివరాల కోసం దృవిత సైన్స్ Druvitha Science ను
చూడండి

Good information bro
ReplyDeleteThanq
Delete