What is the danger to the earth from the sun? | Druvitha Science

Druvitha Science

మన జీవనాధారానికి అతి ముఖ్యమైనది భూమి.
ఈ నేల పెద్ద పెద్ద రాళ్ళు, శిలలు, క్రమక్షయం చెందిన సేంద్రియ పదార్థాలు మట్టి మరియు గాలితో కలసి ఏర్పడింది.
ఇది ఒక్కరోజులో జరిగిన ప్రక్రియ కాదు కొన్ని లక్షల సంవత్సరాల నుంచి జరిగి ఒక సుదీర్ఘ ప్రక్రియ. ఇలా జరిగే చివరికి సమస్త ప్రాణులకు నిలయంగా మారింది.

ఒక్క అంగుళం నేల పైపొర ఏర్పడడానికి 100 నుండి 10,000 వేల సంవత్సరాలు పడుతుంది. దీనిని బట్టి అర్థమైంటది ఈ నేల ఏర్పడడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందని.

ఈ నేల నాశనం అవుతుందా? అయితే ఎలా అవుతుంది?


ఖచ్చితమైన తేది, సంవత్సరం మరియు సమయం చెప్పలేము. కాని భూమి అంతమయ్యే అవకాశాలు మాత్రం ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
అది ఎలా అంటే సమస్త ప్రాణులకు ముఖ్యమైన సూర్యుడి వలన ప్రమాదం పొంచి ఉందని చెప్తున్నారు.

సూర్యుడు హైడ్రోజన్ మరియు హీలియంను ఇంధనంగా చేసుకొని నిరంతరం మండుతున్న అగ్నిగోళం. అయితే దాదాపు 5.5 బిలియన్ సంవత్సరాల నుంచి హైడ్రోజన్, హీలియం స్థాయిలు తగ్గిపోయాయి. ఫలితంగా సూర్యుని యొక్క పరిమాణం రోజు రోజుకి పెరుగుతుంది. సూర్యుని పరిమాణం పెరగడం వల్ల అధిక వేడి (ఉష్ణం), వెలుతురు భూమిని చేరుతుంది. దీని వలన సముద్రాలలో నీరు ఆవిరైపోతుంది మరియు భూమిపై నివసిస్తున్న జీవులు ప్రాణాలు కోల్పోతాయి. చివరికి భూమి ఒక మండుతున్న అగ్నిగోళంలా మారుతుంది.
కొన్ని అధ్యయనాల ద్వారా సూర్యుని యొక్క పరిమాణం సంవత్సరాలు గడుస్తున్న కొద్ది వేగంగా విస్తరిస్తుందని శాస్రవేత్తలు తెలిజేస్తున్నారు.

ఈ భూమి సూర్యుని వలన అంతమయ్యే అవకాశం ఉన్నప్పటికీ అది ఇప్పట్లో జరిగే అవకాశం మాత్రం లేదు. కాని నేడు మానవాళి చేస్తున్న పనుల వలన భూతాపం (భూమి వేడెక్కడం) పెరిగి అతి తక్కువ కాలంలో భూమిపై ఉన్న జీవులు అంతమయ్యే అవకాశాలు మాత్రం ఉన్నాయి. దీనికి ఉదాహరణ రోజు రోజుకి భూమిపై గరిష్టంగా ఉష్ణోగ్రతల స్థాయి పెరగడమే.

గమనిక:
  • సైన్స్ కి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఉంటే రాసి పంపండి. మీ పేరుతో ప్రచురణ చేస్తాం.
  • మేము ప్రచురుణ చేసే వాటిలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని మాకు తెలియజేయండి. అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాము.

దృవిత సైన్స్ ను Follow అవ్వండి
మరిన్ని వివరాల కోసం Druvitha Science ను చూడండి

Comments

  1. Good Analysis...write articles on Kovid-19 impact on common man life. &
    Its impact on students life style.Thank you.

    ReplyDelete

Post a Comment

Feel Free To Leave A Comment