Water Our Life | Druvitha Science
మనం
బ్రతకడానికి నీరు కావాలి. బతుకు సాగించడానికీ నీరు కావాలి
శరీర. వ్యవస్థలో నీటికున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలను వివిధ భాగాలకు చేరవేస్తుంది.
నీరే లేకపోతే ఆ పోషక విలువల పంపిణీ బంద్. మంచమెక్కాల్సిందే. మన శరీరంలో 70 శాతం దాకా నీరే.
ఆహారం
లేకుండా ఐదు వారాలు బతకొచ్చు కానీ, నీళ్లు లేకుండా ఐదు రోజులు కూడా ఉండలేం. ఒంట్లో
తగినంత నీరు లేకపోవడం ప్రాణానికే ప్రమాదం. మూత్రపిండాలు మన శరీరంలోని వ్యర్థాలను
నీటి ద్వారానే బయటికి పంపుతాయి. నీరు లేకపోతే ఆ చెత్తంతా అలానే పేరుకుపోతుంది.
తగిన మోతాదులో నీరు అందకపోతే చర్మం పొడిబారిపోతుంది. కండరాల్లో కదలిక
సమస్యలొస్తాయి. ఊపిరితిత్తులు, గుండె సక్రమంగా పనిచేయదు. అందుకే రోజుకు కనీసం
రెండు లీటర్ల నీళ్లు తాగాలి అంటారు డాక్టర్లు. వేసవిలో ఆ మోతాదు మరింత పెరగాలి. గొంతు
తడుపుకోవడానికో, దప్పిక తీర్చుకోవడానికో మాత్రమే కాదు.... పరిపూర్ణ ఆరోగ్యం కోసం
తాగాలి.
నీటి
కొరత తీవ్రంగా ఉన్న రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో చర్మ రోగాలు మొదలు మూత్రపిండాల
సమస్య దాకా అనేక రుగ్మతలు రాజ్యమేలుతున్నాయి. నీటి కరువు మనస్సు మీద ప్రభావం
చూపుతుంది. మానసిక వ్యాధులకు కారణం అవుతుంది. ఇదంతా వ్యక్తికి సంబంధించి.
వ్యవస్థను ఇరుకున పెట్టే ప్రభావాలు ఉన్నాయి. తగినంత సాగునీరు అందకపోతే, పంటలు
ఎండిపోయి దిగుబడి తగ్గిపోతుంది. ఆహారధాన్యాల కొరత ఏర్పడుతుంది. నిత్యావసరాల ధరలు
చుక్కల్ని తాకుతాయి. డ్యాములు ఎండిపోతే జలవిద్యుత్ తగ్గిపోతుంది. పారిశ్రామిక
ప్రగతి మందగిస్తుంది. నిరుద్యోగం అధికం అవుతుంది.
పరిస్థితి
ఇలానే ఉంటే, 2030 నాటికి భారతదేశంలో తీవ్ర
దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని ఇంటర్నేషనల్ వాటర్ మేనేజ్మెంట్
హెచ్చరిస్తోంది. దీనికి కారణం 2030 నాటికి దేశ జనాభా
రెట్టింపు అవుతుంది. అంటే నీటి సరఫరాను 700 బిలియన్ క్యూబిక్
మీటర్ల నుంచి 1400 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పెంచితీరాలి.
దాదాపుగా అసాధ్యామైన పనే ఇది. ఇక అంతమంది ఆకలి తీర్చాలంటే, ఎంత పంట పండించాలి?
అందుకు ఎంత సాగునీరు కావాలి? ఇప్పటికే భూగర్భాన్ని ఎంతగా పిండేయలో అంతగా పిండేశాం.
తవ్వితీసుకోవడానికి అక్కడేమీ మిగలదు. ఆ జలసంక్షోభం నుంచి ఎలా బయటపడాలి?
తలచుకుంటేనే వణుకుపుడుతుంది.
నీరు లేకపోతే మానవ శరీరంలో జరిగే మార్పులు
- నిస్సత్తువ : శరీరానికి నీరే ప్రధాన శక్తి వనరు, ఒంట్లో నీటి వనరులు ఓ స్థాయికి మించి తగ్గిపోతే అలసట పెరుగుతుంది. నిస్సత్తువ ఆవహిస్తుంది.
- కొలెస్ట్రాల్ : నీరు తగ్గేకొద్దీ శరీర వ్యవస్థ సంక్షోభంలో పడుతుంది. కణాల నుంచి నీటి నష్టాన్ని నియంత్రించడానికి శరీరం మరింత కొలెస్ట్రాల్ను ఉత్పత్తి చేస్తుంది.
- అధిక రక్తపోటు : ఒంట్లో పుష్కలంగా నీరు ఉన్న సమయంలో రక్తంలో తొంబై శాతం దాకా నీరే ఉంటుంది. ఒంట్లో నీటి కొరత పెరిగేకొద్దీ రక్తం చిక్కబడుతుంది. రక్తప్రవాహానికి ఆటంకాలు ఏర్పడతాయి. దీంతో అధిక రక్తపోటు సమస్య వస్తుంది.
- మూత్రపిండ సమస్యలు : నీటి నిలువలు తగ్గిపోతే వ్యర్థ పదార్థాలు రసాయన వ్యర్థాలు ఒంట్లోనే పేరుకుపోతాయి.
- ఆ వ్యర్థాలు హానికర బ్యాక్టీరియాకు నిలయంగా మారుతుంది. అలాంటి వాతావరణంలో మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఎక్కువ.
- జీర్ణకోశ సమస్యలు : నీటి నిల్వలతో పాటు మెగ్నీషియం, క్యాల్షియం తదితర ఆల్కలైన్ ఖనిజాల ఉత్పత్తి పడిపోవడంతో ఆల్సర్లు, జీర్ణ సంబంధమైన సమస్యలు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది.
- మలబద్ధకం : శరీరంలో నీరు తగ్గిపోతే పెద్దపేగు గుండా వ్యర్థాల కదలిక మందగిస్తుంది కొన్నిసార్లు స్తంభించిపోతుంది. దీంతో మలబద్ధకం వచ్చేస్తుంది. ఈ సమస్య అనేక రుగ్మతలకు దారితీస్తుంది.
- మోకాళ్ల నొప్పులు : శరీరంలోని ఒత్తిడి అంతా మోకాలి మీద ఉంటుంది. ఆ ఒత్తిడిని నివారించడానికి కీళ్ల దగ్గర నీటి తో కూడిన కాట్రిలేజ్ పాడింగ్ ఉంటుంది. నీటి నిలువలు తగ్గిపోతే అది బలహీనపడుతుంది నొప్పులు మొదలవుతాయి.
- చర్మ సమస్యలు : ఒంట్లో సరిపడా నీరు లేకపోతే చర్మం ద్వారా వ్యర్థాలు బయటికి వెళ్ళలేవు. దీంతో ఎక్కడికక్కడ పేరుకుపోయి విషతుల్యంగా మారతాయి. అనేక చర్మ సమస్యలు రావచ్చు. చర్మం కళాకాంతుల్ని కోల్పోయిన, అకాల వృద్దాప్య ఛాయలు కనిపిస్తాయి.
- ఊబకాయం : నీళ్లు తగ్గిపోతే శరీరంలో ఒక రకమైన క్షామ పరిస్థితులు ఏర్పడతాయి. కణాలలో అభద్రత మొదలవుతుంది. శక్తిని నిల్వ చేసుకోవడానికి శరీరం అవసరానికి మించి ఆహారాన్ని తీసుకుంటుంది. దీంతో బరువు పెరిగి ఊబకాయం వచ్చేస్తుంది.
ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టే మార్గాలు
- ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంత తప్పనిసరి. దీనివల్ల భూగర్భ జలాలు మెరుగుపడతాయి.
- డాబా మీద కురిసే వర్షపు నీటిని నిల్వచేసుకోవడానికి ఒక ట్యాంక్ ఏర్పాటు చేసుకుంటే మొక్కలకు గృహ అవసరాలకు వాడుకోవచ్చు.
- మొక్కలకు ఉదయం సాయంత్రం వేళలో నీరు పోస్తే ఆవిరి అయిపోయే సమస్య ఉండదు. అందులోనూ తక్కువ నీటితో బతికే అలంకరణ మొక్కలు పెంచుకోవడం ఉత్తమం.
- ఏవైనా పనులు చేస్తున్నపుడు కుళాయిని అలానే వదిలేయకుండా నీరు అవసరం అయినప్పుడు మాత్రమే
తిప్పుకోవాలి. సెన్సార్ సౌకర్యం ఉన్న కుళాయి అయితే మరీ మంచిది. ఇలాంటి జాగ్రత్తల
వల్ల వారానికి ఐదు వందల లీటర్ల నీరు ఆదా అవుతుంది.
- పైపుల లీకేజీ, నల్లాల మరమ్మతులు నీటి వృధా కు ప్రధాన కారణం. ఏదైనా సమస్య వస్తే వెంటనే ప్లంబర్ ను పిలిపించడం ఉత్తమం. ఒక కుళాయి లీక్ అయిన రోజుకు 100 నుంచి 150 లీటర్ల నీరు డ్రైనేజీ పాలైనట్టే.
- తక్కువ బట్టలు ఉంటే వాషింగ్ మిషన్ వాడకపోవడం మంచిది. దీనివల్ల నెలకు నాలుగైదు వేల లీటర్ల నీరు ఆదా అవుతుంది.
- షవర్ స్నానం కంటే బకెట్ స్నానమే ఉత్తమం. సగానికి సగం నీటితో సంపూర్ణ స్థానం అయిపోతుంది.
- మన వాహనాలను వారానికోసారి కడిగి తీరాలన్న నిబంధన లేదు దీనివల్ల నీటి వృధా తప్పించి వాహనాలకు వచ్చే అదనపు మెరుపులు ఉండవు.
![]() |
| SAVE WATER |
మరిన్ని
వివరాలకు దృవిత సైన్స్ ను చూడండి





Comments
Post a Comment
Feel Free To Leave A Comment