ప్రకాశించే మొక్కలను సృష్టించిన శాస్త్రవేత్తలు
ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ ఎంతలా అభివృద్ధి చెందిందో మనందరికీ తెలుసు. ఆ టెక్నాలజీని ఆధారంగా చేసుకొని శాస్త్రవేత్తలు
బయోలుమినిసెంట్ పుట్టగొడుగులను ఉపయోగించి ప్రకాశించే మొక్కలను సృష్టించారు.
నేచర్
బయో టెక్నాలజీలో ప్రచురించబడిన కొత్త
పరిశోధనలో జన్యుపరంగా ఎన్కోడ్ చేయబడిన ఆటో లుమినిసెంట్ గురించి చెప్పడం జరిగింది. దీనిని కనుగొనడానికి శాస్త్రవేత్తలు బయోలుమినిసెంట్ పుట్టగొడుగుల నుండి ఒక DNAను
ముక్కలుగా చేసి ఒక పొగాకు మొక్క లో ఎక్కించడం జరిగింది. ఈ పద్ధతి ప్రకాశించే మొక్కలు నిజంగా ప్రకాశించేందుకు సహాయపడింది.
నియనోథపనస్ నంబి అని పిలువబడే బయోలుమినిసెంట్ పుట్టగొడుగు నుండి నాలుగు జన్యువులను పొగాకు మొక్కల DNAలోకి చేర్చారు. ఈ జన్యువులు కేఫిక్ ఆమ్లాన్ని లుసిఫెరిన్ గా మార్చడంలో సహాయ పడ్డాయి. ఇది శక్తిని కాంతి రూపంలో విడుదల చేయడంలో సహాయపడుతుందని ఈ అధ్యయనంలో వివరించడం జరిగింది.
రష్యన్
అకాడమీ ఆఫ్ సైన్సెస్ నుండి కరెన్ సర్కిస్యన్ మరియు ఇలియా యంపోల్స్కి నేతృత్వంలో
ఈ అధ్యయనం జరిగింది.
పొగాకు
మొక్క జన్యుపరంగా సాధారణమైనది మరియు ఇతర మొక్కల కంటే త్వరగా పెరిగే మొక్క కావున
దీనిని ఎంచుకున్నారు.
భవిష్యత్తులో
ఈ టెక్నాలజీ వివిధ మొక్కల యొక్క జీవిత కాలంలో జరిగే హార్మోన్ల కార్యకలాపాలను
చూసేందుకు ఉపయోగపడుతుందని కరెన్ సర్కిస్యన్ చెప్పాడు. అంతే కాకుండా పర్యావరణంలో
జరిగే వివిధ మార్పులను పర్యవేక్షించడంలో కూడా ఇది సహాయపడుతుందని చెప్పాడు.
ఈ అధ్యయనం భవిష్యత్తులో వృక్ష శాస్త్రజ్ఞుల జీవితాలను మార్చగలవు. ఎందుకంటే వారు మొక్కల యొక్క లోపలి పని తీరును అధ్యయనం చేయడానికి దీనిని ఉపయోగించవచ్చు.
Source : Science alert
దృవిత
సైన్స్ ను Follow అవ్వండి
మరిన్ని
వివరాలకు దృవిత సైన్స్ ను చూడండి

Fabulous
ReplyDeleteThank you
Delete