నెదర్లాండ్ లోని అమ్స్టర్ డ్యామ్ లో
ఏర్పాటు చేసారు. దీని పేరు మైక్రోపియా ఇది కేవలం సూక్ష్మ జీవులకు సంబంధించినది
అంటే వైరస్లు, బ్యాక్టీరియాలు, శిలింద్రాలు మొదలైన వాటికోసం 2014లో ఈ మ్యూజియాన్ని ప్రారంభించడం
జరిగింది.
మన రోజువారి జీవనంలో చాలా విషయాలు
మనం గమనించం అందులో సూక్ష్మజీవుల పాత్ర ఖచ్చితంగా ఉంటుందని మనకు తెలియదు.
ఉదాహరణకి
పాలు పెరుగు గా మారటం, ఇడ్లీ మరియు దోశ పిండి పులియబెట్టడం వంటి విషయాల్లో, జంతు
వృక్ష వ్యర్థాలను కుళ్ళీంపజేసి సేంద్రియ ఎరువులుగా మార్చడంలో సూక్ష్మజీవులే ప్రముఖ
పాత్ర పోషిస్తాయి. ఇలా మనకి ఉపయోగపడేవే కాకుండా మనకు హాని చేసే సూక్ష్మజీవులు కూడా
మన శరీరం మీద చాలా ఉంటాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం సుమారు 1.5 కిలోల సూక్ష్మజీవులు మన శరీరం మీద ఉంటాయని అంచనా.
ఇలా నిత్యజీవితంలో సూక్ష్మజీవుల
పాత్ర ఉంది కాబట్టి వాటి మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఏర్పచడం కోసం సూక్ష్మజీవుల
ప్రదర్శనశాలను ప్రారంభించారని ఆ ప్రదర్శనశాల నిర్వాహకులు చెప్తున్నారు.
ఆ మ్యూజియంలో కంటికి కనిపించని వాటిని వీక్షకులు చూసేందుకు మైక్రోస్కోల
వంటి నిర్మాణాలను ఏర్పాటు చేసారు.
ఆసక్తికర విషయం ఏంటంటే సూక్ష్మజీవులు మన శరీరంపై
ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిలోని రకాలు అవి ఒకరి నుంచి ఒకరికి ఎలా వ్యాపిస్తాయని
తెలియజేసే మైక్రోబ్ బాడీ స్కానర్ వంటి పరికరాలు ఇక్కడ ఉన్నాయి. సూక్ష్మజీవుల
నిర్మాణం వాటి వ్యాప్తి గురించి కొన్ని రకాల వీడియోలు కుడా ఈ మ్యూజియంలో మనం చూడవచ్చు.
భయంకరమైన ఎయిడ్స్, ఎబోలా మరియు ఇప్పుడు బయపెడుతున్న కరోన వంటి సూక్ష్మజీవులను చూడచ్చు.
ఇంకో ఆసక్తికరమైన విషయం Kiss-O-Meter ద్వారా ఇద్దరు వ్యక్తులు ముద్దు
పెట్టుకున్నప్పుడు ఎన్ని రకాల సూక్ష్మజీవులు మార్పిడి అవుతాయో కుడా చెప్పవచ్చు.
Images Source : Wikipedia
Comments
Post a Comment
Feel Free To Leave A Comment