ఏమిటి ఈవైరస్ ?
ఈ మధ్య కరోనా వైరస్ గురించి మీరూ వినే
ఉంటారుగా... దీని బారిన పడకుండా ఉండేందుకు పెద్దవాళ్లు జాగ్రత్తలు చెబుతూనే
ఉన్నారుగా... ఇదంతా సరే! ఇంతకీ వైరస్ అంటే ఏంటి? అది ఎందుకు ఇంత ప్రమాదకరం? అసలు దాని సంగతులేంటీ?
* వైరస్ అనేది లాటిన్ పదం. దీనికి విషం
అని అర్థం.
* వైరస్‌లు అతి సూక్ష్మజీవులు.
* వీటిని మామూలు కంటితో చూడలేం.
శక్తిమంతమైన మైక్రోస్కోపులతో మాత్రమే చూడగలం.
* ఇవి ఇతర జీవుల కణాలపై దాడి చేసి
వ్యాధులకు కారణమవుతాయి.
* ఈ దాడి ముఖ్య ఉద్దేశం తమ సంతతిని
పెంచుకోవడమే. వైరస్‌లు విభజన చెందడం ద్వారా వాటి సంతతిని పెంచుకుంటాయి. ఇలా
జరగాలంటే వాటికి జీవకణం తప్పనిసరి. అంటే ఇవి ఇతర జీవుల శరీరాల్లోకి
ప్రవేశించినప్పుడు మాత్రమే వాటి సంఖ్యను పెంచుకోగలవు.
* వైరస్ చుట్టూ ప్రొటీన్‌తో ఏర్పడిన
రక్షణ కవచం ఉంటుంది. దీన్ని క్యాప్సిడ్ అంటారు.
* మరో విషయం ఏంటంటే వైరస్‌లు
బ్యాక్ట్టీరియా, శిలీంధ్రాల (ఫంగస్) కన్నా
శక్తిమంతమైనవి.
* అప్పుడప్పుడు వైరస్‌లు బ్యాక్టీరియా, ఫంగస్‌లపై దాడి చేస్తాయి.
* బ్యాక్టీరియాపై దాడి చేసే వైరస్‌ను
బ్యాక్టీరియోఫేజ్ అంటారు.
* వైరస్‌ల గురించి అధ్యయనం చేసే
శాస్త్రాన్ని వైరాలజీ అంటారు.
* జలుబు, ఫ్లూ, మశూచి, పోలియో, చికెన్ పాక్స్, డెంగీ, ఎబోలా, ఎయిడ్స్, ఏవియన్ ఫ్లూ, రేబిస్, వైరల్ హెపటైటిస్, జపనీస్
ఎన్సెఫలైటిస్, సార్స్, తాజాగా కరోనా వంటివి వైరస్‌ల వల్లే వ్యాపిస్తున్నాయి.
* ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3,20,000 రకాల వైరస్‌లున్నాయని అంచనా.
* చార్లెస్ చాంబర్లాండ్ 19వ శతాబ్దంలో పోర్సలీన్ ఫిల్టర్
సాయంతో మొదటిసారిగా వైరస్‌ని గుర్తించాడు.
* బ్యాక్టీరియాల కన్నా వైరస్‌లు అతి
సూక్ష్మమైనవి.
* వైరస్‌లకు వైరస్ అనే పేరును డచ్
సూక్ష్మజీవశాస్త్రవేత్త (మైక్రోబయాలజిస్టు) మార్టినస్ బీజెరింక్ ప్రతిపాదించాడు.
* మైక్రోస్కోపుల్లో వైరస్‌లు కనిపించేవి
కావు. అందుకే ఎలక్ట్రానిక్ మైక్రోస్కోపును కనుగొన్న తర్వాత వైరస్‌ల గురించి
పూర్తి సమాచారం శాస్త్రవేత్తలకు తెలిసింది.
* జీవుల్లో ఉండాల్సిన అతి ప్రాథమిక
నిర్మాణమైన కణ నిర్మాణం వైరస్‌లకు లేదు.
* ఇతర జీవకణాలపై ఆధారపడకుండా వాటంతట అవి
వృద్ధి చెందలేవు.
* కానీ వీటిలోనూ జన్యుపదార్థం ఉంటుంది.
* బ్యాక్టీరియాల్లో మంచివి, చెడ్డవి ఉన్నట్లు.. వైరస్‌లు రెండు
రకాలు లేవు.
* వైరస్ అంటేనే ఇతర జీవులకు హాని
చేస్తాయి.
* మరో విషయం ఏంటంటే వైరస్‌లలో ఆడ, మగ అని రెండు రకాలు లేవు.
* వైరస్‌లలో వాటి శరీర నిర్మాణాలను బట్టి
హెలికల్ వైరస్‌లు, ఐకొసహెడ్రల్ వైరస్, ఎన్వలప్డ్ వైరస్, కాంప్లెక్స్ వైరస్ అని ప్రధానంగా
నాలుగు రకాలుంటాయి.
* మన శరీరంలోనూ చాలా వైరస్‌లుంటాయి.
అయినా మనం ప్రతీసారి అనారోగ్యానికి గురికాము. అలా అని వాటిని మంచి వైరస్‌లు అని
చెప్పలేం. కారణం ఏంటంటే.. కొన్ని రకాల వైరస్‌లు శరీరంలో ఉన్నప్పటికీ నిద్రాణస్థితి
(స్లీప్‌మోడ్)లో ఉంటాయి.
* ఎప్పుడైతే మన శరీరంలో రక్షణవ్యవస్థ
(ఇమ్యునిటీ సిస్టం) బలహీనపడుతుందో.. అప్పుడు వైరస్‌లు విజృంభించి వేగంగా తమ
సంతతిని పెంచుకుని.. దాడి చేస్తాయి.
* అన్ని పరిస్థితులు అనుకూలించినప్పుడు
ఇవి ఎంత వేగంగా తమ సంఖ్యను పెంచుకుంటాయంటే.. ఈ ప్రక్రియను ఓ కాగితాన్ని
వేలకాపీలుగా జిరాక్స్ చేసినదాంతో పోల్చుకోవచ్చు.
* అప్పుడు వాటి సంఖ్య పెరిగి.. ఆ మనిషి
అనారోగ్యానికి గురవుతాడు.
* మొత్తానికి వైరస్ అంటే ఓ రకంగా
రాక్షసి అని చెప్పుకోవచ్చు.
Comments
Post a Comment
Feel Free To Leave A Comment