Photosynthesis | Biology Study Material | Druvitha Science
మన జీవన విధానంలో కిరణజన్య సంయోగక్రియ
- ఒక పదార్ధం తయారు అవడానికి శక్తి అవసరము.
- ఆకులకు ఆకుపచ్చ రంగు క్లోరోఫిల్ అనే వర్ణద్రవ్యం వలన కలుగుతుంది.
- కిరణజన్య సంయోగక్రియ ఆకుపచ్చ మొక్కలలో ఉండే హరిత రేణువులు సూర్యకాంతిలో కార్బన్ డై ఆక్సయిడ్, నీరు ఉపయోగించి కార్బోహైడ్రేట్ తయారుచేసే కాంతి రసాయన చర్య.
- కిరణజన్య సంయోగక్రియలో మాత్రమే ఆక్సిజన్ సృష్టించబడుతుందని హైడ్రిల్లా మొక్క ప్రయోగం ద్వారా చూపవచ్చు. కిరణజన్య సంయోగక్రియలో ఆకులలో పిండి పదార్థం ఏర్పడుతుంది. అయోడినను పరీక్షకము (రిఏజెంట్)గా ఉపయోగించి పిండి పదార్థం ఉనికిని తెలుసుకోవచ్చు.
- అయోడిన్ వేసిన తరువాత నీలిరంగుగా మారితే అది పిండిపదార్థం ఉనికి తెలియచేస్తుంది.
- కిరణజన్య సంయోగక్రియ సామర్థ్యంపై ప్రభావం చూపే కారకాలను (a) బాహ్యకారకాలని, (b) అంతర కారకాలని వర్గీకరించవచ్చు. వర్గీకరించవచ్చు.
- బాహ్యకారకాలు కాంతి, కార్బన్ డై ఆక్సయిలు. అంతర కారకాలు హరితరేణువులు (పత్రహరితము), నీరు.
- కాంతికిరణాలు 'ఫొటానులు' అని పిలువబడే అతిచిన్న రేణువులు. ఒక ఫొటోన్ లో ఉండే శక్తిని క్వాంటమ్ అని అంటారు.
- మనకు కనబడే కాంతి 400-700nm మధ్య వుంటుంది. ఇది UV మరియు IR ల మధ్య ఉంటుంది.
- మనకు కనబడే కాంతి ఏడురంగుల (VIBGYOR) మిశ్రమము.
- ఏ కాంతి తరంగదైర్ఘ్యము ఎక్కువ గ్రహిస్తుందో అది కిరణజన్య సంయోగక్రియకు ఎక్కువ శక్తిని అందజేస్తుంది.
- వర్ణపటం (స్పెక్ట్రమ్)లో ఇది రుణ, నీలికాంతులకు దగ్గరగా ఉండి, ఎక్కువ కిరణజన్య సంయోగక్రియ జరుపుతుంది. ఆకుపచ్చ రంగు కాంతిని, హరితవర్ణ ద్రవ్యము పరావర్తనం చేస్తుంది.
- హరితరేణువులో ఉండే థైలకాయిడ్ పొరమీద ఉన్న పత్రహరిత అణువులు, కాంతిలోని శక్తిని శోషించి, కిరణజన్య సంయోగక్రియా చర్యలను ప్రారంభిస్తాయి.
- కార్బన్ డై ఆక్సయిడ్ వాతావరణంలో సుమారు 0.03% పరిమాణంలో ఉంది. ఇది పత్రరంధ్రాల ద్వారా కణాలలోకి విసరణ ద్వారా ప్రవేశిస్తుంది.
- పొటాషియం హైడ్రాక్సయిడ్ కార్బన్ డై ఆక్సైడ్ ను శోషిస్తుంది.
- పత్రాల బాహ్య చర్మంలో సొమేటా అని పిలువబడే పత్రరంధ్రాలు ఉంటాయి.
- పత్రం కింద భాగంలో ఉండే పత్రరంధ్రాల సంఖ్యను బట్టి వాయువుల శోషణ రేటు ఆధారపడి ఉంటుంది. పత్రరంధ్రాల అమరిక తీరు గోళ్ళకు వేసుకొనే రంగు పాలిష్ తో అధ్యయనం చేయవచ్చు.
- వేరుచేసిన పత్రహరిత వర్ణద్రవ్యాలు కిరణజన్య సంయోగక్రియకు సహాయపడవు.
- ఆకుపచ్చ మొక్కలన్నిటిలోను త్వచము (Membrane) తో కూడిన హరితరేణువులు ఉంటాయి.
- హరిత రేణువులు చక్రాభం (Discoid) గా ఉండి లోపల వర్ణరహిత అవర్ణిక (Stroma) తో నిండి ఉంటుంది.
- అవర్ణిక దొంతర దొంతరులుగా ఉండే థైలకాయితో నింపబడి ఉంటుంది. దీనినే పటలికారాశి లేక గ్రానమ్ అంటారు. ఇవి అవర్ణిక పటలికల (Stroma lamellae)తో కలుపబడి ఉంటాయి.
- పత్రహరితము దాని అనుబంధ వర్ణద్రవ్య అణువులు థైలకాయిడ్ త్వచము పై అమరి దానిమీద చర్యాకేంద్రాలుగా నిర్మించబడి ఉంటాయి.
- ఈ కేంద్రాలు కాంతి చర్య వ్యవస్థ I (PSI) మరియు కాంతి చర్య వ్యవస్థ II (PSII) అని రెండు రకాలుగా ఉంటాయి.
- ఎలక్ట్రానులను అందించే పదార్థాన్ని దాత అని, గ్రహించే దానిని గ్రహీత అని పిలుస్తారు.
- ఎలక్ట్రాన్ గ్రహీతలకు ఉదాహరణలు : నికోటిన్ అమైడ్ అడినైన్ డై న్యూక్లియోటైడ్, (కుప్లంగా NAD అంటారు), నికోటిన్ అమైడ్ అడినైన్ డై న్యూక్లియోటైడ్ ఫాస్పేట్ (NADP), సైటోక్రోమ్లు, ప్లాస్టోక్వినోన్లు, ఫెర్రిడాక్సిన్లు మొదలైనవి.
- ఒక ఎలక్ట్రాన్ గ్రహీత క్షయకరణచెందితే, అది హైడ్రోజన్, ఎలక్ట్రాన్లను మరో గ్రహీత అణువులకు బదిలీ చేస్తుంది.
- కిణజన్య సంయోగక్రియ శక్తితో కూడిన అణువులను తయారుచేస్తుంది.
- హైడ్రోజన్ పరమాణువులో ఒక ప్రొటాన్ (ధనాత్మక), ఒక ఎలక్ట్రాన్ (రుణాత్మక) రేణువులు ఉన్నాయి
- ప్రొటాన్ కదలికలో ఉండేశక్తిని, జీవవ్యవస్థలో ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ (ATP) అనే అణువులో నిక్షిప్తము, నిల్వచేయబడుతుంది.
- శక్తి అవసరమైనపుడు ATP జలవిశ్లేషణచెంది, ఎడినోసిన్ డై ఫాస్ఫేట్ (ADP) గా మారి, శక్తి విడుదల చేస్తుంది.
- కాంతిచే ఉత్తేజకమయిన పత్రహరితం నీటి అణువును ఛేదించే ప్రక్రియను నీటి కాంతి విశ్లేషణ (Photolysis - photo = light; lysis = breakdown) అంటారు.
- కాంతిచర్యల అంతిమ ఉత్పత్తులు ఆక్సిజన్, NADPH మరియు ATP.
- కార్బన్ డై ఆక్సైడు ఉపయోగపడి, గ్లూకోజ్ ఏర్పడాలంటే NADPH, ATPల ఉత్పత్తి అవసరము.
- కొన్ని చర్యలకు కాంతి అవసరంలేదు. వీటిని నిష్కాంతి చర్యలు అంటారు.
- హరితరేణువులలోని అవర్ణికలో జరిగే చర్యల పరంపరగా, కార్బన్ డై ఆక్సయిడ్ వినియోగించబడు గ్లూకోజ్ ఉత్పత్తి అవుతుంది.
- మెల్విన్ కాల్విన్ అనే అమెరికా శాస్త్రజ్ఞుడు కార్బన్ డై ఆక్సైడు గ్లూకోజ్ గా మారే చర్యలను గుర్తించాడు.
- కార్బన్ డై ఆక్సైడు స్థాపనలో జరిగే చర్యల వలయాన్ని కాల్విన్ వలయం అంటారు. ఈ పరిశోధన చేసినందుకు కాల్వినుకు నోబెల్ బహుమతి లభించింది.
- కార్బన్ డై ఆక్సయిడ్ లో ఉండే కార్బన్ పరమాణువు, ఐదు కార్బన్ పరమాణువులుగల రైబ్యులోజ్ - 1-5 డై ఫాస్ఫేట్ చే స్థాపించబడి ఆరు కార్బన్ పరమాణువులుగల సమ్మేళనం ఏర్పడుతుంది. అది వెంటనే రెండు ఫాస్ఫోగ్లిసరిక్ ఆమ్ల (PGA) అణువులుగా విచ్ఛిన్నమవుతుంది.
- PGA గ్లిసరాల్డిహైడ్ - 3 - ఫాస్ఫేట్ గా మారి, ఆ మార్పు చెందుతుంది.
- ఆకుని మొక్క యొక్క ఆహారకర్మాగారం అని అంటారు.
- పత్తి, ఆముదం వంటి మొక్కలలో, అన్నివేళలా అధిక కాంతి గ్రహించడానికి వీలుగా వాటి పత్రదళాలు వంగి ఉంటాయి. హరితరేణువులు, పత్రహరితం ఉండుటవలన ఆకు కిరణజన్య సంయోగక్రియకు ఒక ముఖ్య భాగంగా ఉంది.
- పత్రానికి 1. పత్రదళము (Lamina) 2. పత్రవృంతము (Petiole) 3. పత్రపీఠము (Leaf base) అని మూడు భాగాలు ఉంటాయి.
- పత్రములో విస్తరించిన భాగాన్ని పత్రదళం అంటారు.
- పత్రదళ మధ్య భాగంలో ప్రధానంగా ఉన్న ఈ నెను నడిమి ఈనె (Midrib) అంటారు.
- ఆకు కింది బాహ్య చర్మంలో ఎక్కువ సంఖ్యలో చిన్న రంధ్రాలు ఉంటాయి. వీటిని పత్రరంధ్రాలు అంటారు.
- ప్రతి పత్రరంధ్రముకు ఇరువైపులా మూత్రపిండాకారపు రక్షక కణాలు ఉంటాయి.
- ఆకు రెండు బాహ్య చర్మాల మధ్య ఉండే కణజాలాలను పత్రాంతర కణజాలం అంటారు.
- పత్రాంతర కణజాలం వరుసలలో నిలువుగా అమర్చబడిన వాటిని సంభకణజాలమని, ఒక క్రమపద్ధతిలో లేకుండా, పెద్ద పత్రాంతర స్థలాలతో కూడిన కణజాలాన్ని స్పంజికణజాలమని అంటారు.
- పత్రాంతర కణజాలాలలో ఎక్కువ హరితరేణువులు ఉంటాయి.
- పత్రపు మధ్య ఈనె, ఇతర ఈ నెలలో ప్రసరణకణజాలము నిర్మించబడింది.
- ప్రతి ప్రసరణ కణజాలంలో పోషక కణజాలం ఆకు అడుగు భాగంవైపున, దారుకణజాలం (Xylem) ఆకు పై భాగంవైపున
- ఉండేటట్లు అమర్చబడి ఉంటాయి.
- కిరణజన్య సంయోగక్రియ అధికంగా పత్రంలో పైభాగం వైపే జరుగుతుంది.
- ఆకు ఇటూ, అటూ గాలిలో ఊగడానికి పత్రవృంతం, ఎక్కువ కాంతి గ్రహించడానికి పత్రదళం ఉన్నాయి.
- హరిత రేణువులలో పగటి సమయంలో చక్కెర పిండి పదార్థంగాను, రాత్రి సమయంలో అది చక్కెరగాను మారుతుంది. ఆకును సౌరశక్తిని, రసాయనిక శక్తిగా మార్చడంలో ఒక అద్భుతమైన, సహజమైన యంత్రంగా పరిగణించవచ్చు.
Comments
Post a Comment
Feel Free To Leave A Comment