Biology In Our Life | Biology Study Material | Druvitha Science
నిత్య జీవితంలో జీవశాస్త్రం
- వృక్షాలు, జంతువులు, సూక్ష్మజీవులు మొదలైన జీవుల పరిశీలనే “జీవశాస్త్రం”
- బయాలజీ మొదట ప్రవేశపెట్టినది – “జీన్ లామర్క్” (ప్రెంచ్ శాస్త్రవేత్త)
- జీవుల బాహ్య, అంతర నిర్మాణం, అవిచేసే పనులు - వాటి పోషణ, శ్వాసక్రియ, చలనం, పెరుగుదల, అభివృద్ధి, ప్రత్యుత్పత్తి, సంతాన వ్యాప్తి మొదలైన, ప్రతి అంశాన్ని తెలిపే శాస్త్రమే “జీవశాస్త్రం.”
- బయాలజీ(గ్రీకు భాష), బయోస్ అనగా జీవము - లోగోస్ అనగా శాస్త్రము
- భూమి మీద మానవుడు ఉద్భవించినప్పటి నుండి, జీవశాస్త్ర అధ్యయనం చేస్తూనే ఉన్నాడు.
- “మానవుడు మొదట జీవశాస్త్రవేత్త, తరువాతే ఇంకేదయినా"
- జీవశాస్త్రం గురించి లిఖితరూపంలో
మొదటిసారిగా ఎవరి నుంచి లభించింది - అరిస్టాటిల్ (క్రీ.పూ. 384-322), గేలన్ (క్రీ.శ. 130-200)
- మతపరమైన భావాలు (మూఢనమ్మకాలు) శాస్త్ర భావాల కంటే ప్రాభల్యంగా ఉండటం వల్ల 15వ శతాబ్దం వరకు జీవశాస్త్రంలో పరిశీలనలు జరగలేదు. ఈ కాలాన్ని “శాస్త్రానికి చీకటి యుగం” అంటారు.
- 16వ శతాబ్దంలో, వైశాలియస్ (1514-1564), విలియమ్ హార్వే (1578-1657)ల పరిశోధనలవల్ల జీవశాస్త్రం పునర్జీవం పోసుకుంది.
- ఈ 50 సం||లలో జీవశాస్త్రంలో సంపాదించిన విజ్ఞానం గత '20' శతాబ్దాలలో సంపాదించిన దానికంటే ఎక్కువ.
- భూగర్భ జలాలు అడవుల నిర్మూలన వల్ల తరిగిపోతాయి.
- భూమి స్థితి రసాయనిక ఎరువుల వాడకం వల్ల మారుతుంది.
- తక్కువ కాలంలో, ఎక్కువ ఆహారాన్ని ఇచ్చే మొక్కలను, వ్యాధి ప్రతిరోధకం కలిగిన మొక్కలను వరణాత్మక ప్రజననం, సంకరణముల వల్ల ఉత్పత్తి చేయవచ్చు.
- జంతువులలో వరణాత్మక ప్రజననం వల్ల, ఎక్కువ పాలనిచ్చే పశుసంపద, ఎక్కువ గుడ్లు పెట్టే కోళ్ళను ఉత్పత్తి చేయటం జరిగింది.
- ప్రస్తుత కాలంలో అతి తక్కువ కాలంలో కావలసిన లక్షణాన్ని ఒక మొక్క నుంచి, ఇంకో మొక్కకు మార్చడానికి, కణజాల వర్ధనంతోబాటు, జెనెటిక్ ఇంజనీరింగును కూడా ఉపయోగిస్తారు.
- బాక్టీరియాలను సంహరించే, పెన్సిలిన్ వంటి సూక్ష్మ జీవనాశకాలు శిలీంధ్రాల నుండి లభిస్తాయి.
- సహజంగా లభించే ఔషధాల అధిక ఉత్పత్తికి కణజాల వర్ధనాన్ని, జెనెటిక్ ఇంజనీరింగ్ ని ఉపయోగించటం జరుగుతున్నది.
- మొదట్లో, ఇన్సులిన్ ని పందులు, పశువుల నుండి తీసుకొనేవారు. నేడు జెనిటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తికి కారకమైన జన్యువుని వేరుచేసి, దానిని బాక్టీరియాలలో ప్రవేశపెడుతున్నారు.
- జన్యుచికిత్స : వ్యాధులకు కారణమైన జన్యువును గుర్తించి, వాటిని సక్రమంగా పనిచేసే జన్యువులచే భర్తీ చేయడం. జన్యువులలో కలిగే ఆకస్మిక మార్పులను “ఉత్పరివర్తనాలు" అంటారు.
- పాశ్చరైజేషన్ వల్ల దేనిని ఎక్కువ కాలం నిల్వచేయవచ్చు - పాలు.
శాస్త్రవేత్తలు – జీవశాస్త్రం అర్థం చేసుకోవడానికి చేసిన సేవలు
1.అరిస్టాటిల్(క్రీ.పూ.384-322), గ్రీకు దేశస్తుడు.
- జీవశాస్త్ర పరిశీలనలో, శాస్త్రీయ విధానాన్ని అవలంభించిన వ్యక్తి.
- జీవులని వర్గీకరించే పద్ధతిని ప్రవేశపెట్టాడు.
- కోళ్ళు, ఇతర జంతువుల పిండాభివృద్ధి వర్ణన ద్వారా ఆధునికంగా ఉద్భవించిన “పిండోత్పత్తి శాస్త్రానికి” నాంది పలకటం.
- “జీవశాస్త్ర పితామహుడు" అని పేరొందిన వ్యక్తి.
2.ఆంథోని వాన్ ల్యూవిన్ హుక్(1632-1723), డచ్చి దేశస్థుడు.
- మైక్రోస్కోపును కనిపెట్టి జీవశాస్త్రంలో అనేక పరిశీలనలు చేసిన అగ్రగణ్యుడు.
- ఒకే కటకం కల్గి, చూనే నిర్మాణాన్ని 200-400 రెట్లు పెద్దదిగా చూపుగల మైక్రోస్కోపు తయారీ.
- రకరకాల మైక్రోస్కోపులను 200 దాకా తయారీ చేసాడు.
- జలాలలోను, రక్తంలోను, దంతాల పాచిలోను, ప్రేగులలోని ద్రవాలయందు, మల విసర్జితంలో ఉండే వివిధ రకాల సూక్ష్మజీవులను కనుగొన్నాడు.
- బాక్టీరియాలను వర్ణించిన వారిలో ప్రథముడు.
- మైక్రోస్కోపు వాడకాన్ని నిర్దేశించిన మొట్టమొదటి వ్యక్తి.
3.విలియం హార్వే(1578-1657), బ్రిటీష్ వైద్యుడు
- జంతువుల హృదయం, రక్తప్రసరణ వ్యవస్థల మీద పరిశీలన.
- శాస్త్రీయ పద్ధతిని మొట్టమొదట ప్రవేశపెట్టాడు.
- వర్ణనాత్మక అధ్యయనం నుండి జీవశాస్త్ర స్థాయిని ప్రయోగ పరనా స్థాయికి చేర్చాడు.
- గుండె నుండి రక్తం ధమనులలోనికి పంపబడి, తిరిగి సిరల ద్వారా, గుండెని చేరుతుందని నిరూపించాడు.
4.లూయీ పాశ్చర్(1822-1895), ఫ్రెంచి దేశస్థుడు.
- మైక్రోబయాలజిలో విశేషమైన సేవలు చేసిన రసాయన శాస్త్రవేత్త
- ద్రాక్ష సారాయి చెడిపోవడానికి సూక్ష్మజీవులు కారణమని కనిపెట్టాడు.
- వేడి చేయటం వల్ల బాక్టీరియా నశించి, సారాయి చెడి పోకుండా ఉంటుందని నిరూపించాడు.
- పాలు మొదలైన అనేక వదార్థాలను నిల్వచేయటానికి “పాశ్చరైజేషన్” పద్ధతి సూచించాడు.
- పట్టు పురుగు, గుడ్లను సూక్ష్మజీవులు పాడుచేస్తాయని కనుగొని, వాటిని నిర్మూలించే పద్ధతిని కని పెట్టాడు.
- గొర్రెలకు సోకే “ఆంధ్రాక్స్” వ్యాధికి టీకా కనుగొన్నాడు.
- “రేబిస్" వ్యాధి నయం చేయు విధానంను సూచించాడు.
5. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు(1895-1948), పశ్చిమగోదావరి, భీమవరం
- జీవ రసాయన శాస్త్రవేత్త.
- ఫోలిక్ ఆమ్లం, టెట్రాసైక్లిన్లు, కాన్సర్ నిరోధక ఔషధాలను
- ఉత్పత్తి చేసే పద్ధతులను అభివృద్ధి చేశాడు.
- టెట్రాసైక్లిన్ (ప్లేగు వ్యాధికి మందు)ని ప్రపంచానికి సుబ్బారావు గారిచ్చిన బహుమానం.
- 1995 సం||రాన్ని "సుబ్బారావు శతజన్మదినోత్సవ సంవత్సరం"గా జరుపుకున్నాం.
- “అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు” (Wizard of the Wonder Drug)
6. సర్ రోనాల్డ్ రాస్(1857-1932), బ్రిటీష్ దేశస్థుడు
- ఇండియా, ఆఫ్రికా వంటి దేశాల్లో గల మలేరియాపై హైదరాబాద్లో చేశాడు.
- 1902లో నోబెల్ బహుమతిని పొందినాడు.
7.జేమ్స్ డి. వాట్సన్, (అమెరికా) మరియు F.H.C. క్రిక్ (FHC), (బ్రిటీష్ దేశస్థుడు)
- జేమ్స్ డి. వాట్సన్ DNA (డి ఆక్సీ రైబోస్ న్యూక్లిక్ ఆమ్లం) నిర్మాణం మీద పరిశోధనలు చేశారు.
- శరీరంలో వివిధ రకాల ప్రోటీనులను సంశ్లేషణము చేయటానికి కావలసిన సమాచారం DNA లో ఉండును.
- DNA యొక్క “ద్వికుండలి” నిర్మాణము ప్రతిపాదించటం ద్వారా “అణు జీవశాస్త్రానికి" పునాదులు వేశారు.
- వీరికి, విల్ సన్ అనే శాస్త్రజ్ఞునితో బాటు, 1962లో నోబెల్ బహుమతి లభించింది.
8. సలీమ్ మొయిజుద్దీన్ అబ్దుల్ ఆలి(1896-౦౦౦౦)
- “సలీమ్ ఆలి” అని అంటారు.
- "ఆర్నిథాలజి"లో మన దేశంలో అగ్రగణ్యుడు.
- పక్షుల గురించి రెండు పుస్తకాలు రాశాడు.
- వన్యమృగ సంరక్షణార్ధం ఇచ్చే “పాల్ గెట్టి " బహుమానం లభించింది.
9.M.S. స్వామినాథన్
- పూర్తి పేరు “మానకొంబు సాంబశివన్ స్వామినాథన్”.
- మనదేశంలో “హరిత విప్లవ పితామహునిగా” పరిగణిస్తారు.
- గోధుమ, వరి సంకర రకాలను బంగాళా దుంప, నార రకాలు ఉత్పత్తి చేశాడు.
- ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చికి డైరెక్టర్ జనరల్‌గా పని చేశారు. (ICAR)
- ఫిలిప్పైన్స్ లోని ఇంటర్ నేషనల్ రైస్ రీసెర్చి సంస్థ డైరెక్టర్‌గా పనిచేశారు.
- “స్వామినాథన్ రీసెర్చి పౌండేషన్" స్థాపించారు.
10. హరగోబింద్ ఖోరానా(1922-౦౦౦౦), పంజాబ్
- జన్యుస్మృతిని వెలుగులోనికి తెచ్చిన వారిలో ఒకరు.
- కృత్రిమ జన్యువు సంశ్లేషణ చేశారు.
- జన్యుశాస్త్రంలోను, అణుజీవ శాస్త్రంలోను చేసిన సేవలకు 1968లో నోబెల్ బహుమతి లభించింది.
11. బీర్బల్ సహాని(1891-1949)
- లక్నో విశ్వవిద్యాలయంలో వృక్షశాస్త్రంలో ఆచార్యులుగా పని చేశారు.
- పురావృక్ష శాస్త్రానికి సేవలు చేశారు.
- వివృత బీజాలకు సంబంధించిన వృక్ష శిలాజాలను కనుగొన్నారు.
- ఈయన పరిశీలనలు "ఖండాల కదలిక” సిద్ధాంతానికి రుజువులనిచ్చాయి.
12.సర్ T.S, వెంకట్రామన్
- “కోయంబత్తూరులోని” ఇంపీరియల్ కేన్ ట్రేడింగ్ స్టేషన్ “అధిపతిగా పనిచేశారు.
- చెరకు, జొన్నని సంకరణం చేసి చెరకు పంటని అభివృద్ధి చేశాడు.
- చెరకు పంట అభివృద్ధి చేసినందుకు గాను, 1942లో ఇంగ్లండు దేశపు రాణిచే గౌరవింపబడ్డారు.
13.పంచానన్ మహేశ్వరి(1904-1966), రాజస్థాన్
- ఢిల్లీ విశ్వవిద్యాలయంలో వృక్షశాస్త్ర ఆచార్యులుగా పని చేశారు.
- వృక్షాల పిండోత్పత్తి శాస్త్రంలో ఘనమైన సేవలు చేశారు. - “పరిస్థానిక ఫలదీకరణం" అనే పద్ధతి కనుగొన్నారు.
- ఈ పద్ధతివల్ల సహజంగా సంకరణ కావింపబడని మొక్కలను సంకరణం లేక వృక్షాల ఫలదీకరణం చేయించి కొత్త మొక్కలను పరీక్ష నాళికలో ఉత్పత్తి చేశారు.
- వృక్షాల “ఆధునిక పిండోత్పత్తి శాస్త్రానికి పితామహుడిగా” కీర్తింపబడ్డారు.
భారతదేశంలోని పరిశోదన సంస్థలు
1.నేషనల్ బొటానికల్ రీసెర్చ్
ఇన్స్టిట్యూట్ ఇండియన్(NBRI), లక్నో - వృక్షశాస్త్ర పరిశోధనలు.
2.అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(IARI), న్యూ ఢిల్లీ - వ్యవసాయ రంగంలో పరిశోధనలు.
3.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
న్యూట్రిషన్(NIN),
హైదరాబాద్ – న్యూట్రిషన్ పరిశోధన.
4.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
ఓషియానోగ్రఫీ(NIO),
గోవా – సముద్ర జంతువులపై పరిశోధనలు.
5.సెంటర్ ఫర్ సెల్లులర్ ఎండ్
మాలిక్యూలర్ బయాలజీ(CCMB), హైదరాబాద్.
6.సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్
రీసర్చ్(CICR),
నాగపూర్.
7.సెంట్రల్ రైస్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్(CRRI), కటక్.
8.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్
కేన్ రీసర్చ్(IISR),
లక్నో.
9.ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్
రీసర్చ్(ICMR),
న్యూ ఢిల్లీ.
10.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(NIV), పూనే.
11.ఇంటర్ నేషనల్ క్రాప్ రీసెర్చి
ఇన్స్టిట్యూట్ ఫర్ సెమిఎరిడ్ ట్రాపిక్స్(ICRISAT), హైదరాబాద్
జీవశాస్త్రం – శాఖలు
1.వృక్షశాస్త్రము – వృక్షాల అధ్యయనం
2.జంతుశాస్త్రము – జంతువుల అధ్యయనం
3.శరీరధర్మ శాస్త్రము – శరీర అవయవాలు, అవి చేసే జీవక్రియల గురించి, ఉదా: జీర్ణక్రియ, శ్వాసక్రియ, రక్తప్రసరణ, ప్రత్యుత్పత్తి మొదలైనవి.
4.పిండోత్పత్తి శాస్త్రం - జీవులలో
గుడ్డుదశ నుండి ప్రౌఢదశ వరకు జరిగే పెరుగుదల, అభివృద్ధిల గురించి తెలిపేది.
5. శరీర నిర్మాణశాస్త్రం - వృక్షాల, జంతువుల అంతర నిర్మాణాన్ని గురించి
తెలిపేది.
6. వర్గీకరణ శాస్త్రం - జంతువృక్షాల
వర్గీకరణ గురించి తెలిపే శాస్త్రం.
7. వ్యాధి విజ్ఞానశాస్త్రం - వ్యాధి
వల్ల, జీవులలో
కలిగే మార్పులను తెలిపే శాస్త్రం.
8. సూక్ష్మజీవశాస్త్రం - వైరస్, బాక్టీరియా ఏకకణ జీవుల వంటి 'సూక్ష్మజీవుల గురించి తెలిపే శాస్త్రం.
9. జీవావరణ శాస్త్రం - జీవులకు అవి
నివసించే ఆవరణానికి మధ్యగల సంబంధాన్ని తెలుపుతుంది.
10. జన్యుశాస్త్రం - అనువంశికత గురించి
తెలుపుతుంది.
11. జంతు భూగోళశాస్త్రం - ప్రపంచంలో
జంతువుల విస్తరణని తెలుపును.
12. పురాజీవ శాస్త్రం - గతించిన జంతువులు, వృక్షాల గురించి తెలుపును.
Comments
Post a Comment
Feel Free To Leave A Comment