Structure Of Blood | Blood Formation | Blood Structure | Druvitha Science

Structure Of Blood | Blood Formation | Blood Structure | Druvitha Science

రక్తం-స్వరూపం, నిర్మాణం

రక్తం దేహంలో బంధిత ప్రసరణ వ్యవస్థ ద్వారా (ClosedCirculation) ప్రసరించే ద్రవరూప బంధన కణజాలం(Fluid connective Tissue) ఇది దేహంలోని వివిధ భాగాలకు ప్రసరిస్తూ ప్రధాన అంశీభూతాలను చేరవేయడంలో నిరోధకశక్తిని పెంపొందించడంలో రక్తస్రావాన్ని ఆపటంలో శరీర ఉష్ణోగ్రతా క్రమతలో తోడ్పడుతుంది. రక్తం రెండు ప్రధాన భాగాలను కలిగి ఉంటుంది. మొదటిది ద్రవరూప కణబాహ్యమాత్రిక దీన్నే 'ఫ్లాస్మా' అని అంటారు. రెండోది రక్తకణాలు రక్తంలో ప్లాస్మా 55% రక్తకణాలు 45% వరకు ఉంటాయి.

1. ప్లాస్మా

ఇది లేత పసుపు వర్ణం గల జిగురులాంటి చక్కని ద్రవం. దీనిలో నీరు 90-91%, ఇతర రసాయన పదార్థాలు 10-9% వరకు ఉంటాయి. ప్లాస్మాలో ముఖ్యమైన ద్రావణశీలి అయిన ప్రొటీన్లు, ఆల్బుమిట్లు, గ్లోబీలున్లు, ఫైబ్రినోజన్లు ఇవిగాక కర్బన పదార్థాలు, మూలక సమ్మేళనాలు కూడా ఉంటాయి. రక్త స్కందనలో ప్లాస్మాలోని ఫైబ్రినోజన్ పూర్తిగా ఫైబ్రిన్ రూపంలో విడివడి రక్తపు (blood clot) ముద్దగా మారడం వల్ల మిగిలిన స్వచ్ఛమైన స్నిగ్ధ ద్రావణాన్ని “సీరమ్” అంటారు. సీరమ్ లో ఫైబ్రినోజన్ తప్ప అన్ని రసాయన పదార్థాలు ఉంటాయి. ప్లాస్మా దేహంలో ధమని, సిరా వ్యవస్థల ద్వారా రక్త ప్రసరణలో పదార్థాల రవాణాకు తోడ్పడటంలోనూ శరీర ఉష్ణోగ్రతను క్రమపరచటంలోనూ ప్రధాన పాత్ర వహించే ప్రవాహ ద్రవం.

ఎ. ఆల్బుమిన్లు

ఇవి అమైనో ఆమ్లాలతో ఏర్పడిన సామాన్య ప్రోటీన్లు, వీటి అణుభారం 69,000 నుంచి 70,000 వరకు ప్లాస్మాలో ఆల్బుమిన్లు గొబిలిన్లకు మూడు రెట్లు అధికంగా ఉంటాయి.

బి. గ్లోబిలిన్లు

ఇవి రక్తంలో నిరోధక శక్తిని పెంపొందించే ప్రతి రక్షకముల నిర్మాణంలో తోడ్పడతాయి. వీటిలో A, B, Y అనే మూడు ముఖ్య రూపాలు ఉంటాయి. ఇవి ప్రధానంగా దేహంలో ప్రోటీను సంశ్లేషణ క్రియలో తోడ్పడతాయి.

సి. ఫెబ్రినోజిన్

రక్తంలో దీని శాతం అల్బుమిన్లు గ్లోబిలిన్ల కంటే చాలా తక్కువ. రక్తస్కందన చర్యలో ఇవి ప్రముఖపాత్ర వహిస్తాయి. ఫైబ్రినోజిన్ రక్తఫలకికల సమక్షంలో ఫైబ్రిన్ తంతువులుగా ఏర్పడి వలను పోలిన నిర్మాణంలో రక్తకణాలను చేర్చి స్కందన క్రియను జరుపుతాయి. ఇవేగాక రక్తంలో నిర్మాణాత్మక ప్రోటీన్లు, లైపొప్రోటీన్లు, హార్మోన్లు విటమిన్లు, మొదలైనవి ఉంటాయి.

డి. అకర్బన సమ్మేళనాలు

సోడియమ్, పొటాషియం, కాల్షియం,మెగ్నీషియం, వాటి క్లోరైడ్లు, కార్బొనేట్లు పాస్ఫేట్లు, మూలక పదార్ధాలు ఐరన్, కాపర్, అయోడిన్లు మొదలయినవి ఉంటాయి. సీరమ్ లో పోషక పదార్థాలు, అమైనో ఆమ్లాలు, గ్లూకోజ్ చక్కెరలు, వెటబొలైట్లు, వర్ణపదార్ధాలు, ఆంటెజెన్, ఆంటి బాడిలు (ప్రతి జనకాలు, ప్రతి రక్షకాలు) బిలురుబిన్ లాంటి ఉత్పన్న పదార్థాలు ఉంటాయి.

రక్తకణాలు - రక్తంలో మూడు రకాల కణాలు ఉంటాయి. అవి

1. అరుణ కణాలు లేదా ఎరిత్రోసైట్లు (R.B.C)

2. శ్వేత కణాలు లేదా తెల్ల రక్త కణాలు (W.B.C)

3. రక్త ఫలకికలు లేధా థ్రాంబోసైట్లు.

రక్తాన్ని అపకేంద్రీకరించినప్పుడు పైన ప్లాస్మాద్రవం 55% గా మరియు కింద రక్తకణాలు 45% గా ఏర్పడతాయి.

1. అరుణకణాలు (ఎరిథ్రోసైట్లు) (erythros-red: cytos=cells)

అరుణ కణాల్లో ఎరుపు వర్ణం హీమోగ్లోబిన్ అనే సంయుగ్మ ప్రోటీను ఉండటం వల్ల ఏర్పడింది. రక్తంలో ఏర్పడ్డ కణాలన్నిటి కంటే ఇవి బరువయినవి. అరుణ కణాలు ద్విపుటా కారంగా ఉంటాయి. వీటి కేంద్ర భాగంలో పంచగా లేత ఎరుపు వర్ణంతో అంచులు మందంగా ఉండి గాఢ ఎరుపు వర్ణంతో ఉంటా యి. ద్విపుటాకారంతో అరుణ కణాలు అధిక ఉపరితల వైశాల్యం తో ఉండటం వల్ల ఎక్కువ మొత్తంలో ఆక్సిజనను సులభంగా తేలుకుంటూ పోతాయి. వీటికి స్వయం గమన శక్తి లేదు వ్యాధిగ్రస్తుల కణాల్లో ద్విపుటాకారత లోపించడం వల్ల (స్పిరో సైటూసిన్) సాధారణ అరుణ కణాలలోని అనేక సదుపాయాలు వీటిలో ఉండవు. అరుణ కణాల్లో కేంద్రకం అరుణ కణాల్లో కేంద్రకం ఇతర కణాంగాలు అంతర్జీవ ద్రవ్యజాలకం (ఎండోప్లాస మిక్ రెటికులమ్) రైబోసోమ్ లు, మైటోకాండ్రియాలు, సెంట్రోసోమ్ లోపించాయి. కాబట్టే ఈ కణాలు ప్రొటీను సంశ్లేషణను జరపలేవు. వీటిలో శక్తి ఉత్పాదన కేవలం గ్లూకోజు అణువుల విచ్ఛిత్తి వల్ల మాత్రమే ఏర్పడుతుంది. అరుణ కణాల విధుల్లో అతి ప్రధానమయింది. దాంట్లోని హిమోగ్లోబిన్ ద్వారా ఆక్సిజన్ గ్రహించి కణాలకు చేరవేయటం. కణాలనుంచి కార్బన్ డై ఆక్సైడ్ ను సేకరించి కణ బాహ్య విసర్జనకు రవాణా చేయడం ఈ విధంగా అరుణకణాలు నిరంతరం జీవిలోపల జరిగే శ్వాసక్రియలో వాయుమార్పిడికి సహకరించే ప్రధాన వాహకాలు అరుణ కణాలు జీవన కాల పరిమితి 120+20 రోజులు వయసు మీరిన కణాలు రెటిక్యులో ఎండోథిలియల్ ఆర్గాన్స్ (spleerect) లో విచ్ఛిన్నమవుతాయి. ఈ ప్రక్రియలో హీమ్ ఆక్సిజనేజ్ అనే ఎంజైము చర్యవల్ల కణత్వచం చిట్లిపోయి హీమోగ్లోబిన్ అణువు హీమ్, గ్లోబిన్ భాగాలుగా విడిపోతుంది. ఈ విధంగా ఏర్పడిన హీమ్ (ఇనుప ధాతువు) రెటికులో ఎండొధిలియల్ కణాలలో ఫెరిటిన్ లేదా హిమోసిడరినక్ రూపంలో నిలవచేయబడి నూతన హిమోగ్లోబిన్ అణువిశ్లేషణలో ఉపయోగపడుతుంది. మిగిలిపోయిన పోర్ ఫైరిన్ రింగు, పూర్వస్థిత గ్లోబిన్ చట్రం, బిలు హిబిను వర్ణకంగా మార్పు చెందుతుంది. అరుణ కణాలు ఎముకలోని ఎరుపు మజ్జ (bone morrows) లో ఉత్పత్తి అవుతాయి. ఈ ప్రక్రియను అరుణ కఠిత్పాదన (Haenopoisis) అంటారు. పురుషుల రక్తంలో వీటి సంఖ్య 5200,000 + 3,00,000 (5–55) (Millions/ cuonm) స్త్రీలలో 4,700,000 వరకు ఉంటుంది. పుట్టిన శిశువుల్లో వీటి సంఖ్య అధికంగా 6,830,000 వరకు ఉంటుంది. అరుణ కణాల సంఖ్య అసాధారణంగా పెరిగితే పాలిసైధిమియా అని, సాధారణ సంఖ్య కంటే చాలా తగ్గితే ఎరిధోపీనియా అని అంటారు.

2.శ్వేత కణాలు-ల్యూకోసైట్లు (Leukos = Whife, Cytos = Cell)

రక్తంలోని తేలే ఈ కణాలు నిర్దిష్ట రూపం లేదా అమీబాను పోలిన కదలికను కలిగి ఉంటాయి. ఈ కణాల్లో వర్ణ పదార్థమేదీ లేకపోవటం వల్ల శ్వేతకణాలు లేదా తెల్లరక్తకణాలు (W.B.C) అని అంటారు. వీటిలో కేంద్రకం స్పష్టంగా రూపొంది ఇవి శరీరానికి రక్షణ వ్యవస్థను ఏర్పరచటంలో సహకరిస్తాయి. రక్తంలో శ్వేతకణాల సంఖ్య 5,000 నుంచి 10,000 ఘ.మి.మీ. వరకు ఉంటుంది.

రక్తంలో తేలే వివిధ రకాల శ్వేత కణాలు ఈ కింద పేర్కొన్న విధంగా ఉంటాయి.

శ్వేత కణాల వర్గీకరణ వాటిలోని కేంద్రకం కణపదార్థం స్వరూప స్వభావాన్ని బట్టి ఏర్పడింది. రక్త స్మిహరును లిష్ మాన్ వర్ణకంతో రంజిస్తే దానిలో ఆమ్లవర్ణకం చర్యవల్ల కేంద్రం నీలివర్ణంలో రంజించగా క్షార వర్ణకం ఇసినోఫిల్స్, న్యూట్రోఫిల్స్, బెసోఫిల్స్ శ్వేతకణాల్లోని రేణువులను రంజిస్తుంది. ఈ రకంలో శ్వేత కణాలను క్రింది విధంగా విభజించవచ్చు.

తెల్ల రక్త కణాలు(ల్యుకోసైట్స్)

ఇవి రెండు రకాలుగా ఉంటాయి.

1) రేణు సహిత కణాలు

A) న్యూట్రోఫిల్స్(50%-70%), B) ఇసినోఫిల్స్(1%-8%), C) బెసోఫిల్స్(0.2%-1%)

2) రేణు రహిత కణాలు

రేణు సహిత కణాలు

ఈ రకానికి చెందిన శ్వేతకణాల కణపదార్ధంలో రేణువులు లేదా కణికలు ఉంటాయి. దీంట్లోనిది కేంద్రక స్వరూప లక్షణం ఆధారంగా మూడు రకాలుగా విభజించవచ్చు. ఎ) న్యూటోఫిల్ కణాలు, బి) ఇసినోఫిల్ కణాలు. సి) బేసోఫిల్ కణాలు.

1. రేణు సహిత కణాలు (Gramuto eytes)

ఎ) న్యూట్రోఫిల్స్ కణాలు

న్యూట్రోఫిల్ కణాలను బహురూప కేంద్రకం కణాలు (Polymorph nuclear cells or PMN) అని అంటారు. దీనికి ముఖ్య కారణం వీటిలోని కేంద్రకం ఒకటి కంటే ఎక్కువ లంబికలను కలిగి ఉంటుంది. కణం పెరుగుతున్న కొద్దీ లంబికల సంఖ్య పెరుగుతుంది. ఆరోగ్యవంతుడిలో కేంద్రక లంబికల సంఖ్య ఏడు వరకు ఉండవచ్చు. శ్వేత కణాల ముఖ్యవిధి శరీర రక్షణ వ్యవస్థకు ఉపకరించటం, ఇవి శరీరంలోకి ప్రవేశించిన బాక్టీరియాలను చుట్టూ ముట్టి వాటిని భక్షించి వాటి ఉనికి వల్ల ఏర్పడే హానిని తొలగించి రక్షణ కల్పిస్తాయి. కాబట్టి ఈ కణాలను భోజక కణాలని (Phagocyte 8) అంటారు. న్యూట్రోఫిల్ కణాల్లోని లైసోసోముల్లో గల అనేక ప్రోటియోలైటిక్, ఎమైలోలైటిక్, లిపోలైటిక్, న్యూక్లియోటిడేస్లు బక్షించబడిన బాక్టీరియా పై జలవిశ్లేషణ చర్యలు జరిపి వాటి సంపూర్ణ విచ్ఛిత్తిని జరుపుతాయి. వ్యక్తి తీవ్ర బాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ కు గురయినప్పుడు న్యూట్రోఫిల్ కణాల సంఖ్య అత్యధిక గరిష్ట స్థాయికి చేరటం, వీటి వైదేశిక కణబోజకత్వ లక్షణం చేత రక్షణ కల్పించే ప్రక్రియలో భాగమని గమనించాలి. శరీరంలో బాక్టీరియా సంక్రమణం (Infection) వల్ల ఏర్పడిన ఇన్ఫ్లమేషన్కు చెందిన ప్రాంతంలో న్యూట్రోఫిల్ కణాలు మితిమీరిన సంఖ్యలో రక్షకభట సైన్యంలాగా ఉంటాయి. ఇలాంటి కణోత్పత్తిని న్యూట్రోఫీలియా అం టారు. అయితే న్యూట్రోఫీనియా (Neutropaenia) అంటారు. ఇది ఏగ్రానులో సైటాసిస్ అనే పరిస్థితుల్లో సంభవిస్తుంది.

బి) ఇసినోఫిల్ కణాలు

ఇయోసిన్ అనే ఎరుపు వర్ణకాన్ని ఈ కణాల్లోని రేణువులు కలిగి ఉంటాయి. ఇసినోఫిల్ కణంలోని రేణువులు ఇయోసిన్లోని ఆమ్ల రంజనంతో ఎరుపు వర్ణాన్ని దట్టమయిన కటికామయ పదార్థంతో కనిపిస్తాయి. వీటిలోని కేంద్రకం రెండు లంబికలను కలిగి ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో వీటి సంఖ్య 1-8% వరకు ఉంటుంది. శరీరంలో అలర్జీ సంబంధిత పరిణామాలలో, పేగులలో పరాన్న జీవుల వల్ల వ్యాధి సంక్రమించినప్పుడు వీటి సంఖ్య వృద్ధి చెందుతుంది. ఈ ప్రక్రియనే 'ఇసినోఫీలియా' అంటారు. ఈ స్థితిలో ఈ కణాలు హిస్టమిన్ అనే పదార్థాన్ని స్రవించి అనేక రసాయనిక చర్యలను ప్రేరేపించి ఇఫ్లమేషను గురయిన ప్రాంతంలో మృతిచెందిన కణాలను, గడ్డకట్టిన కరిగించి నిర్మూలిస్తాయి.

సి) బేసోఫిల్ కణాలు

ఈ కణాలు పేరుకు తగినట్టుగా క్షార రంజకాల యిన మిథిలిన్ బ్లూ లేదా హిమటాక్సిన్ వర్ణకాలతో స్పష్టంగా కనిపిస్తాయి. వీటిలోని కేంద్రకం స్పష్టత లోపించిన లంబికలతో దట్టంగా ఆవరించిన గాఢ నీలిరంగులతో గుండ్రని పెద్ద కణికల మధ్య ఉంటుంది. రక్తంలోని బేసోఫిలను పోలిన సారూప్య కణా లు (Identical Cells) రక్తం వెలుపల గల కణజాలంలో కూడా ఉంటాయి. వీటిని మాస్ కణాలు అంటారు. బోసోఫిల్ కణాలు హిస్టమిన్, స్పానిన్, హెపారిన్ అనే పదార్ధాలను ఉత్పత్తి చేస్తాయి. ఇన్ఫ్లమేషన్ స్థితిలో బేసోఫిల్ మాస్ట్ కణాలు ఈ స్రావక ములతో వైదేశిక పదార్థాలను విచ్ఛిత్తి చేసి రక్షణ కల్పిస్తాయి.

2. రేణు రహిత కణాలు (Agranulocytes)

ఈ శ్వేత కణాల జీవపదార్ధంలో రేణువులు ఉండవు. వీటిలో కేంద్రకం లంబికలు కలిగి ఉండక పెద్దగా నిర్దిష్టంగా ఉంటుంది. ఈ కణాలు ఎముక లోని ఎరుపు మజ్జలో (Red bone narrow) ఏర్పడి పరిణిత చెందుతాయి. రేణురహిత కణాల్లో రెండు రకాలు. అవి: ఎ. లింఫోసైట్లు, బి. మోనోసైట్లు.

ఎ)లింఫోసైట్లు

ఇవి రేణురహిత గుండ్రని పెద్దదయిన కేంద్రకాన్ని కలిగిన కణాలు. లింఫోసైట్లు చర్యపరంగా రెండు విధాలు: 1. T-లింఫోసైట్లు, 2. B- లింఫోసైట్లు రక్తంలోని లింఫోసైట్లలో సుమారు 70% T- లింఫోసైట్లు మిగిలిన B- లింఫోసైట్లు, ఇవి ప్రధాన రక్షణ వ్యవస్థను ఏర్పరచి దేహానికి ఇన్ పెక్షన్‌కు కారక మయ్యే సూక్ష్మ జీవులతో పోరాడే శక్తినిస్తాయి. శరీరం అసంక్రామ్య ప్రతిచర్యలను పెంపొందించటంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. ఇవి శరీరంలో ప్రవేశించే వైదేశి ప్రతిజనకాలకు (Foreign antigens) విషపదార్థాలకు ప్రతి రక్షకాలను (Antibodies) మరియు ప్రతి విషపూరిత పదార్థాలను (Anti toxins) ఉత్పత్తి చేసి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. లింఫోసైట్ల సంఖ్య పెరిగితే లింఫోసైటాసిస్ అనీ, సంఖ్య తగ్గితే లింఫోసీనియాలనీ అంటారు.

బి) మోనోసైట్లు

ఇవి పరిధీయ రక్తంలోని శ్వేత కణాలలో అతి పెద్ద కణాలు. వీటిలో కేంద్రకం చిక్కుడు గింజ ఆకృతితో ఉంటుంది. శరీర కణజాలంలో మోనోసైట్ల రూపంలో విధులలో పోలిన కణా లుంటాయి. వీటిని మాక్రోఫీజులు అంటారు. ఈ కణాలు పోషకకణుపులు (Lymph nodes) మరియు ప్లీహం నుంచి ఏర్ప డతాయి. శరీరంలో వృత్తి చెందిన లేదా నశించిన విచ్ఛిత్తినొందిన అరుణ కణాలను, రేణురూప విసర్జక పదార్థాలను, కణసంబంధ అవశేషాన్ని, ప్రతిజనక, ప్రతిరక్షక సంక్లిష్టాలను, తొలగించడం వీటి ప్రధాన విధి, ఈ కారణాల వల్ల మోనోసైట్లను రక్తపు పాకీపనివారలు (Seavengers of Blood) అని అంటారు. వీటి సంఖ్య పెరిగిన మోనోసైటాసిస్ గా వ్యవహరిస్తారు.

3.రక్త ఫలకికల (Thrombocytes; Thrombos = clot, cytos = cell)

ఇవి రక్తంలో తేలియాడు పరిపూర్ణ కణాలు కావు. వాటి కణ ఖండిత నిర్మాణాలు, రక్తకణోత్పత్తి దశలలో అస్థి మజ్జ నుంచి ఏర్పడిన ముక్కలు రక్త ఫలకికలుగా రూపొందుతాయి. ఇవి ప్లాస్మాలోని స్కందన కారకాల సమక్షంలో రక్త స్కంధనం జరిగి రక్తస్రావాన్ని నిరోధిస్తాయి. ఈ ప్రక్రియను హిమోస్టాసిస్ (Haem = blood, statis = stoppage) అంటారు. రక్త ఫలకికలతో ఒకదానితో ఒకటి అతుక్కొనే లక్షణం ఉండటం వల్ల చిట్లిన లేదా రంధ్రం పడిన రక్తనాళాల గోడలను ఇవి సిమెంటు లాగా మూసివేసి రక్తస్రావం ఆపివేస్తాయి. రక్త ఫలకికల సంఖ్య లోపిం చిన థ్రాంబోసైటో సీనియా అనే రుగ్మత ఏర్పడుతుంది. దీనివల్ల చిట్లిన రక్తనాళాల రంధ్రాల మూతపడక రక్త స్రావం జరగటం, రక్త స్కంధనం సరిగా ఏర్పడక పోవడం వంటి మొదలయిన తీవ్ర పరిణామాలు సంభవిస్తాయి.

Comments