What is Spyware? How It Works And How To Remove It | Druvitha Science


Druvitha Science

ఒకప్పుడు ఫోన్ కేవలం మాట్లాడానికి మరియు అవసరానికి సందేశాలు(Massages) పంపడానికి ఉపయోగించేవారు. ఇదంతా 2008 కంటే ముందు సంగతి ఎందుకంటే అప్పటికి స్మార్ట్ ఫోన్ వాడకం లేదు కాబట్టి. ఆ తర్వాత అనేక రకాల ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అప్పుడే గూగుల్ కూడా ఆండ్రాయిడ్ సర్వీసెస్ ప్రారంభించింది. ఇక స్మార్ట్ ఫోన్ యుగం మొదలైంది. ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా ఫొటోస్ – వీడియోస్ తీయడం, వాటిని భద్రపరచడం, అలగే ఫోన్ మాట్లాడడం, చాటింగ్ చేయడం, వివిధ రకాల సోషల్ మీడియాన్ని వాడడం మరియు బ్యాంక్ లావాదేవీలు బదిలీ చేసుకోవడం ఇలా దాదాపు అన్ని పనులను ఇంటర్నెట్ సహాయంతో చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్ ఆసరాగా చేసుకోని సైబర్ నేరగాళ్ళు నేడు చేయకూడని పనులతో పాటు అన్ని చేస్తున్నారు. అంటే మన వ్యక్తిగత సమాచరాన్ని(ఫోటోలు – వీడియోలు, మెసేజ్లు , ఆడియో-వీడియోలు మరియు బ్యాంకు డిటైల్స్ మొదలైనవి) దొంగిలించి వాడుకుంటారు లేదా ఇతరులకు అమ్ముకుంటారు. ప్రస్తుతం రోజు రోజుకి పెరుగుతున్న సమస్య అమ్మాయిల ఫోటోలను వీడియోలను దొంగిలించి వాటిని మార్ఫింగ్ చేసి అశ్లీల చిత్రాలుగా సృష్టించి వెబ్సైట్లలలో పెడుతున్నారు. మరికొందరు వాటిని వాళ్ళకే పంపి చెప్పింది చేయాలి అని బెదిరిస్తూ డబ్బులు అడగుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనితో పాటు ఫోన్లో ఉన్న బ్యాంకు డీటైల్స్ ద్వారా మరియు ఫోన్ కి వచ్చే OTPల ద్వారా అకౌంట్లో డబ్బును అతి సులభంగా దొంగిలిస్తున్నారు. ఇలా మనం వేసే ప్రతి అడుగును గుర్తిస్తున్నారు. వీటితో పాటు మనకు తెలియకుండానే మన ఫోన్ ద్వారా ఇతరులకు కాల్స్/మేసేజ్స్ చేస్తుంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఫోన్ మనతో ఉన్నా దాన్ని పూర్తి కంట్రోల్ మాత్రం సైబర్ నేరగాళ్ళ చేతుల్లో ఉంటుంది. వీటన్నింటిని వాళ్ళు స్పైవేర్ సహాయంతో చేస్తారు. అసలు ఈ స్పైవేర్ అంటే ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం
స్పైవేర్ అంటే ఏమిటి?
స్పైవేర్ అనేది మన మన ఫోన్లో, కంప్యూటర్లో చేరి మనకి తెలియకుండానే మనం చేసే ప్రతి పనిని రహస్యంగా గమనిస్తూ వాటిని స్నూపార్ కు పంపడానికి రూపొందించిన మాల్వేర్.
మనం ఆన్లైన్లో చేసే పనుల ద్వారా సేకరించిన డేటాని(బ్యాంక్ అకౌంట్ నెంబర్లు, క్రెడిట్-డెబిట్ కార్డు వివరాలు, ఆడియో వీడియో, ఫోటోలు మొదలైన సమాచారం) ఉపయోగిస్తారు. లేదా ఇతర నేరగాళ్ళకు అమ్ముతారు. దీని ఫలితంగా మన గుర్తింపుకు మన వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలుగుతుంది.
స్పైవేర్ వినియోగదారుల అనుమతి లేకుండా వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఇతరులకు పంపించేది. (వినియోగదారులు అంటే నువ్వు – నేను – మనం – మనమందరం). "స్పైవేర్ అనేది ఇతరుల సమాచారాన్ని సేకరించే ఒక ప్రసిద్ధ పద్ధతి. ఇది చాలా విస్తృతమైనది ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసే అతి పెద్ద సమస్య.
స్పైవేర్ రకాలు
  1. యాడ్‌వేర్: ఇది మీరు ఆన్‌లైన్ వెతికే సమాచారం ఆధారంగా మీకు ఆసక్తి ఉన్న వాటి గురించి ప్రకటనలను ప్రదర్శిస్తుంది.(ఎక్కువగా మీరు మొబైల్స్ గురించి వెతికితే మీరు ఆన్లైన్లో ఎం వెతికినా అక్కడ మొబైల్స్ గురించి ప్రకటనలు వస్తాయి) ఇది కొన్ని సందర్బాలలో ఇబ్బందులను కలిగిస్తుంది.
  2. ట్రాకింగ్ కుకీలు: ఇవి యాడ్‌వేర్ మాదిరిగానే ఉంటాయి, అయినప్పటికీ ఇవి తక్కువ చొరబాటును కలిగి ఉంటాయి.
  3. ట్రోజన్లు: మొబైల్/కంపూటర్లోకి ప్రవేశించిన తరువాత, వాటిలో ఉన్న బ్యాంక్ ఖాతా సమాచారం వంటి సున్నితమైన సమాచారం కోసం వేచిచుస్తాయి. ఆతర్వాత సేకరించి దానిని సైబెర్ నేరగాళ్ళకి పంపుతాయి. వారు డబ్బును దొంగిలించడానికి, బ్యాంక్ ఖాతాలను క్లోస్ చేయడానికి లేదా మోసపూరిత కొనుగోళ్లు చేయడానికి ఉపయోగిస్తారు. బ్యాక్‌డోర్ లేదా రిమోట్ యాక్సెస్ ట్రోజన్ (RAT) ద్వారా కంప్యూటర్ యొక్క పూర్తి నియంత్రణను పొందడానికి కూడా వీటిని ఉపయోగించవచ్చు.
  4. కీలాగర్లు: మనం కీబోర్డ్ లో నొక్కే ప్రతి అక్షరాన్ని తెలుసుకుంటాయి. దీని ద్వారా మన సోషల్ మీడియా అకౌంట్స్ యొక్క యూసర్ నేమ్స్, పాస్వర్డ్ – ఆన్లైన్ బ్యాంకింగ్ సమాచారాన్ని తెలుసుకుంటాయి.
  5. స్టాకర్‌వేర్: ఇది సాధారణంగా మొబైల్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయబడుతుంది. దీని ద్వారా మెసేజ్లు చదవడం, పంపించడం - ఎవరెవరికి కాల్స్ చేస్తున్నారు అని తెలుసుకోవడం, వినడం మరియు వారు ఏ ఏ ప్రదేశాలలో తిరుగుతున్నారో సులభంగా తెలుసుకుంటారు.
  6. స్టీల్‌వేర్: ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లలో ఒక వస్తువుకి బదులుగా వేరొక్క వస్తువుకి అంటే అక్రమదరుని వస్తువులకు పంపిస్తుంది. ఇలా చేసినందుకు సదరు(మనల్ని దారి మళ్లించినందుకు) వ్యక్తికి కొంత డబ్బు అందుతుంది.
  7. సిస్టమ్ మానిటర్లు: కీస్ట్రోక్‌లు, ఇమెయిళ్ళు మరియు చాట్ రూమ్ డైలాగ్‌లు, మనం వెతికిన వెబ్‌సైట్‌లు, ప్రారంభించిన ప్రోగ్రామ్‌లు మరియు ఫోన్ కాల్స్ ఇలా ప్రతిదాన్ని వారు రికార్డ్ చేసి దానిని స్నూపర్ లేదా సైబర్ క్రిమినల్‌కు పంపుతాయి.

హ్యాక్ అయిన ఫోన్ పనితీరు ఎలా ఉంటుంది?
  • ఫోన్లో మనకి తెలియకుండానే కాల్స్/మెసేజ్ వెళ్లడం
  • తెలియని నెంబర్ల నుంచి కాల్స్/మెసేజ్స్ రావడం
  • విపరీతంగా మెయిల్స్ రావడం
  • డేటా బ్యాలెన్స్ వాడకపోయిన తగ్గిపోవడం
  • వాడిన-వాడకపోయిన ఫోన్ వేడెక్కడం
  • బ్యాంక్ అకౌంట్లో డబ్బులు తగ్గడం లేదా ఖాళీ అవ్వడం
  • ఫోన్ పనితీరు నెమ్మదించడం. (స్లో/హ్యాంగ్ అవ్వడం)
  • మనకు తెలియకుండానే మన ఫొటోస్ మరియు వీడియోస్ తీయడం వాటిని ఇతరులకు పంపడం లేదా మన ప్రమేయం లేకుండానే వెళ్ళడం జరుగుతుంది.
  • బ్రౌసర్లో ఏదైనా సెర్చ్ చేస్తున్నప్పుడు పరిమితికి మించి యాడ్స్ రావడం, అలాగే పాప్ అప్స్ ఎక్కువగా వస్తుంటాయి.
  • ఫోన్ స్టోరేజ్ నిండిపోతుంది.
  • ప్రధాన సమస్య బ్యాటరీ అతి త్వరగా తగ్గడం.
  • అశ్లీలమైన ఫొటోస్/వీడియోస్ నోటిఫికేషన్స్ గా వస్తుంటాయి.

ఫోన్ హ్యాక్ అవ్వకుండ ఉండాలి అంటే ఎం చేయాలి?
  • అశ్లీల వెబ్సైట్స్ వాడకం నిరోధించాలి.
  • పబ్లిక్/ఫ్రీ వై-ఫై లకు దూరంగా ఉండాలి. ఫ్రీగా వాడుకోవచ్చు అని కనెక్ట్ అవ్వకూడదు.
  • ఏదైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలనుకుంటే ప్లే స్టోర్/ఆప్ స్టోర్ నుంచే చేసుకోవాలి. ఇతర వెబ్సైట్స్ లో నుండి డౌన్లోడ్ చేయకూడదు.
  • వాట్సప్ లో ఆఫర్స్ అంటూ వచ్చే లింక్స్ ని ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు.
  • తెలియని వాళ్ళ నుంచి వచ్చే కాల్స్/మెసేజ్/లింక్స్ దగ్గరకి వెళ్లకూడదు(స్పందించకూడదు). అలాగే వస్తుంటే వాళ్ళని బ్లాక్ చేయడం మంచిది.
  • అనవసరంగా వై-ఫై, డేటా కనెక్షన్లు ఆన్ చేయకూడదు.
  • మనకి తెలియకుండా ఏవైనా ఫైల్స్ ఉంటే వెంటనే తొలగించాలి. అలాగే తెలియని ఆప్స్ ఉన్న ఇదే చేయాలి.
  • బ్యాంక్ అకౌంట్, ఏటీఎం నెంబర్స్,ఓటీపీలు ఎవరికి ఇవ్వకూడదు, అడిగిన చెప్పకూడదు.
  • ఫోన్ మరియు ఫోన్లోని ఆప్స్ ఎప్పుడు అప్డేట్ చేయాలి

స్పైవేర్ని ఎలా తొలగించాలి?
  • స్పైవేర్ ను తొలగించడానికి అందుబాటులో ఉన్న ఏ సాఫ్ట్వేర్ అంత సులభంగా గుర్తించలేదు. ఎంత స్కాన్ చేసిన కొన్ని రోజులు బాగుంటది తప్పా పూర్తిగా తొలగిపోదు. దీనికి ఒక్కటే మార్గం మన డేటాని బ్యాక్ అప్ చేసుకొని ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి.
  • కంప్యూటర్స్ లో కూడా ఇలాగే చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు.

మీరు హ్యాకింగ్ కు గురైతే ఎం చేయాలి?
  • మీ బ్యాంక్లో డబ్బులు పెద్ద మొత్తంలో తగ్గిన లేదా పూర్తిగా ఖాలీ అయిన వెంటనే సైబర్ క్రైమ్ డిపార్టుమెంటుకి పిర్యాదు చేయాలి.
  • అలాగే ఫోన్ ట్యాపింగ్ అంటే ఫొటోస్ వీడియోస్ తీయడం మరియు ఫోన్లో మాట్లాడే ప్రతి మాట విని మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుంటే వాళ్ళు చెప్పింది చేయకుండ సైబర్ క్రైమ్ డిపార్టుమెంటును సంప్రదించండి.

నోట్: ఎలాంటి లక్షణాలు లేకుండానే అన్ని పనులు స్పైవేర్స్ చేస్తుంటాయి. కాబట్టి ఫోన్ వాడకంలో కొన్ని జాగ్రతలు తీసుకుంటే 90 శాతం పైగా మీరు మీ వ్యక్తిగత వివరాలు భద్రంగా ఉంటాయి. మీరు ఏ సమస్యల్లో పడరూ...........

గమనిక :
  • మాకు మీ సలహాలు – సూచనలు అవసరం.
  • పై సమాచారం వలన మీకు ఏవైనా ఇబ్బందులు/ నష్టాలు జరిగితే మేము బాధ్యులము కాదు.
  • మేము ప్రచురుణ చేసే వాటిలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని మాకు తెలియజేయండి. అలాంటి తప్పులను సరి చేసుకుంటాము. ఇంకోసారి  జరగకుండ చూసుకుంటాము.

మరిన్ని వివరాల కోసం దృవిత సైన్స్ చూడండి

Comments

Post a Comment

Feel Free To Leave A Comment