Scorpion Kills Human? | Druvitha Science


Druvitha Science

తేలు మనిషిని చంపగలదా ?
అరాఖ్నీడ్స్(Arachnida) తరగతికి, స్కార్పియానిడా(Scorpionida) వర్గానికి చెందిన కీటకం తేలు. ప్రపంచపు అన్ని ఉష్ణ ప్రాంతాలలోను ఇవి నివసి స్తాయి. దూలాల క్రింద, రాళ్ళ క్రింద చీకటి ప్రదేశాలలో ఇవి దాగి అటుగా వచ్చే పురుగులను పట్టి తింటాయి. అర్థోపోడాకు చెందిన మొట్టమొదటి జంతువులలో ఇది కూడా ఒకటని శాస్త్రవేత్తలు విశ్వశిస్తు న్నారు. శిలాజాల చారిత్రకాధారాలను బట్టి ఇవి 40 కోట్ల సంవత్సరాల క్రిందటివి అని చెప్తున్నారు. ఇప్పుడు సుమారు 2000 జాతుల తేళ్ళు మనకు కనబడతున్నాయి.

తేళ్ళు చాలా క్రూరమైన జంతువులు. ఇవి ఒంటరి జీవితాన్ని గడుపుతాయి. ఈ కారణం వల్లనే ఇవి మనిషికి మరింత ప్రమాదకరంగా తయారయ్యాయి. ఇళ్ళలో ఇవి జోళ్ళలోను(చెప్పులు), పరుపుల క్రింద, తివాచీల క్రింద దాగి వుంటాయి. బయటనుండి వాటికి ప్రమాదం జరుగుతుందని భావించినప్పుడు అవి మళ్ళీ మళ్ళీ కుట్టడానికి ఏ మాత్రము వెనుకంజ వేయవు. తేలు కాటు తీవ్రత ఒక జాతి నుండి మరొక జాతికి భిన్నంగా వుంటుంది. చాలా జాతుల తేళ్ళు మనిషికి అంత చెప్పుకోదగ్గ ప్రమాదాన్ని కలిగించవు.

తేలు కాటు బాధాకరమైనదే అయినా అది మరణాన్ని కలిగించదు. ఈజిప్సియన్ తేలు, లీరస్ అనే ఉష్ణ జాతుల తేళ్ళు మనిషికి మరణాన్ని కూడా కలిగించగలవు. ఇవి కుట్టినపుడు హృదయము, ఛాతీకి సంబంధించిన కండరాలు, నరాలు చచ్చుబడి మరణము సంభవిస్తుంది. అమెరికాలోను, మెక్సికోలోను పాము కాట్లకంటే తేలు కాట్లకు ఎక్కువమంది మరణిస్తున్నారు,
సాధారణంగా నల్లగాగాని, పసుపు రంగులోగాని ఉండే తేళ్ళు 9 మి.మీ / 0.3 అంగుళాల నుండి 23 సెం.మీ/9 అంగుళాల వరకు వుంటాయి. (ప్రపంచంలో అతి చిన్నది టైఫ్లోచాక్టాస్ మిచెల్లి, అతిపెద్దది హెటెరోమెట్రస్ స్వామెర్దామి) దీని దేహాన్ని రెండు ప్రధానమైన భాగాలుగా విభజించవచ్చు. గట్టి పెంకుతో వుండే తల, ఛాతీ భాగాలను సెఫలోపోథొరాక్స్(Cephalothorax) అంటారు. పొడవైన కడుపు భాగం, తోకకు అగ్రభాగంలో విషపు కొండి వుంటుంది. దీనికి 6 జతల డెక్కలు వుంటాయి.
మొదటి జతను చెలిసిరాక్ (Chalicerac) అంటారు. ఇవి చిన్నవిగా వుండి తేలు భక్షించే(తినే జీవి) జంతువుని ముక్కలుగా చేయడానికి పనికొస్తాయి. రెండవ జతను పెడిపాల్ఫుస్ (Pedipalps) అంటారు. ఇవి పొడవుగాను, దృఢంగాను వుండి వంపు తిరిగి కొక్కాల వలె వుంటాయి. జంతువును కదలకుండా పట్టుకొనేందుకు ఇవి ఉపయోగ పడతాయి. ఇవి కాక దీనికి 4 జతల కాళ్ళుంటాయి.

ఇవి రాత్రిపూట మాత్రమే బయటకి వచ్చే నిశాచర జీవులు. తోక వద్ద గల రెండు గ్రంథుల నుండి కొండెములోకి విషము వెలువడుతుంది. తేలు కాటు కారణంగానే చాలామంది తేలంటే భయపడతారు. కాని నిజానికి చాలా తేళ్ళు మనుషులను అనవసరంగా కుట్టవు. సాధ్యమైనంత వరకు అవి కలహానికి కాలు దువ్వక మారుమూల ప్రాంతాలలో దాక్కొనే వుంటాయి. వాటికి ఎవరయినా ఎటువంటి బాధనైనా కలిగించినప్పుడే ప్రాణభీతితో కుడతాయి.
 Whatsapp FaceBook

గమనిక :
  • మాకు మీ సలహాలు – సూచనలు అవసరం.
  • పై సమాచారం వలన మీకు ఏవైనా ఇబ్బందులు/ నష్టాలు జరిగితే మేము బాధ్యులము కాదు.
  • మేము ప్రచురుణ చేసే వాటిలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని మాకు తెలియజేయండి. అలాంటి తప్పులను సరి చేసుకుంటాము. ఇంకోసారి జరగకుండ చూసుకుంటాము.

దృవిత సైన్స్ ను Follow అవ్వండి
మరిన్ని వివరాల కోసం Druvitha Science చూడండి

Comments