Why Shivering When Cold|How To Fly Aeroplane|Numbness and Tingling|Druvitha Science

Druvitha Science


తిమ్మిరి ఎందుకు ఎక్కుతుంది?
కాళ్ళు, చేతులు, పాదాలు వంటి అంగాలలో రక్త ప్రసారం కొంత సేపు ఆగి, తిరిగి ప్రసరించడం మొదలు పెట్టగానే ఆ అవయవాలు తిమ్మిరి ఎక్కుతాయి. తిమ్మిరేక్కిన శరీరభాగంలో సూదులు పొడిచినట్టు, స్పర్శజ్ఞానం కోల్పోయినట్టు ఉంటుంది. ఉదాహరణకు మనం ఎక్కువ సేపు కూర్చొని పైకి లేస్తే కాళ్ళు, పాదాలలో తిమ్మిరి ఎక్కుతుంది. అవి మొద్దుబారిపోయినట్టు అయిపోతాయి. ఇలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా?
పొడవుగా ఉన్న నీటి గొట్టంలో నీరు ప్రవహించినట్టు మన రక్తనాళాల్లో రక్తం ప్రవహిస్తుంది. నిలువుగా ఉన్న నీటి గొట్టాన్ని మడిస్తే ఏమవుతుంది? నీరు ధారాళంగా ప్రవహించదు, ఎందుకంటే ప్రవాహానికి అడ్డుకట్ట పడి, కొద్ది కొద్దిగా బొట్లు బొట్లుగా ప్రవహిస్తుంది.
రక్తనాళాల్లో రక్తం ప్రవహిస్తున్నప్పుడు వివిధ అంగాలలో గల విషతుల్యమైన వ్యర్థ పదార్థాలను తిసుకోనిపోవడం రక్తం యొక్క అతి ముఖ్యమైన పని. ఈ పనికి అడ్డుకట్ట పడినప్పుడు వ్యర్థ విషపదార్థాలు పేరుకుపోయి. ఆయా అంగాల నుండి మెదడుకు సందేశాలు చేరే వేసే నాడి కణాలను మూసివేస్తాయి. క్రింద కూర్చొని పైకి లేచినప్పుడు ప్రవహించడం ఆగిపోయిన రక్తం తిరిగి ప్రవహించడం వల్ల అవి మొద్దుబారిపోయినట్టు అనిపించి, తిమ్మిరి ఎక్కుతుంది.

చలిగా ఉన్నప్పుడు మనం ఎందుకు వణుకుతాము?
శీతాకాలంలోను, చల్లగా వున్న రోజున మనం ఉన్ని దుస్తువులు(స్వేటర్స్) వేసుకోకపోతే వణకడం అనేది అందరికీ అనుభవంలో ఉన్న విషయమే.
శరీరక శాస్త్రము ప్రకారం వణకడం అనేది కండరాల సహజ కదలిక. మనము వణుకుతున్నప్పుడు మన కండరాలు బిగుసుకోవడం, వదులు అవడం అనేది అనేక సార్లు జరుగుతుంది. ప్రతిసారి మన కండరాలు ముడుచుకొన్నప్పుడు కండర కణాలు శక్తి కోసం ఎక్కువ ఇంధనాన్ని ఖర్చు చేస్తాయి. ఈ కారణంగా శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది.
Druvitha Science

వెచ్చదనం కోసం దేహంలో ఏర్పడే ఒక సహజ సంవిధానమే వణకడం. దేహ ఉష్ణోగ్రత ఒక స్థిరస్థానం నుండి క్రిందకి పడిపోకుండా అది(వణకడం) చేయగలుగుతుంది. మన దేహాన్ని వేడిగా ఉంచుకోనేందుకు కండరాలు ఎక్కువగా కష్టపడే ప్రక్రియ ఇది. చలిగా వున్న రోజున మనం వ్యాయామం చేసినా, ఆటలు ఆడినా మనం వణకము. ఎందుకంటే వ్యాయామం, ఆటల ద్వారా కండరాలను బాగా కష్టపడేలా చేస్తున్నాము. ఏ విధమైన వ్యాయామం ఆటలు లేకపోయినా కుడా నిజానికి ఈ వణుకే దేహానికి వేడిని పుట్టిస్తుంది.
విమానం గాలిలో స్థిరంగా ఎలా నిలబడుతుంది?
మనం పైకి విసిరిన ఏ వస్తువు అయిన క్రిందికి వస్తుందని మనకు తెలుసు కదా! మరి గాలిలో విమానం క్రింద పడకుండ ఎలా ప్రయాణిస్తుంది. అది తేలుతూ సుదూర ప్రాంతాలకు ఎలా వెల్లగలుగుతుంది? అనే విషయాల గురించి తెలుసుకుందాం.
విమానం గాలిలో ఎగరడానికి ముఖ్యంగా నాలుగు శక్తులు పని చేస్తాయి. అవి 1) బరువు(Weight), 2) దానిని పైకి లేపే శక్తి(Lift), 3) ముందుకు తోసే శక్తి(Thrust), 4) ఈడ్చే శక్తి(Drag). విమానాన్ని క్రిందకు లాగే భూమ్యాకర్షణ శక్తియే దాని బరువు. దానిని పైకి లేపే శక్తి లిఫ్ట్. విమానం రెక్కలు గాలిని చేదించుకుంటూ ముందుకుపోవడం వలన ఇది ఏర్పడుతుంది.
druvitha science

విమానాన్ని ఈడ్చే శక్తి దానిని వెనకకు లాగి ఉంచేందుకు ప్రయత్నిస్తుంది. విమానానికి గల ఊర్ద్వ పీడనమే త్రస్ట్(ముందుకు తోసే శక్తి). విమానానికి గల ప్రోపెల్లరులు దానిని ముందుకు తోసే శక్తిని కలుగజేస్తాయి. గాలిలో ఎగురుతున్నప్పుడు విమానం అటూ, ఇటూ కదిలిపోక సమ తూకంలో ఉండడానికి రెండు కారణాలు ఉన్నాయి. అవి 1) దాని ఇంజనులోంచి వచ్చే త్రస్ట్(ముందుకు తోసే శక్తి), దానిని ఈడ్చే శక్తి(Drag)కి సమానం. 2) రెక్కలు కారణంగా ఏర్పడే లిఫ్ట్(పైకి లేపే శక్తి) దాని బరువుకు సమానం.
విమానానికి మూడు ముఖ్య భాగాలు ఉంటాయి. రెక్కలు, తోక భాగము, మిగిలిన ప్రధాన భాగము. ఈ ప్రధాన భాగాములోనే కాక్ పిట్, ప్రయాణికుల విభాగం ఉంటుంది. దీనినే “ఫ్యుటిలేజ్” అని అంటారు. తోక భాన్ని “రాడార్” అంటారు. అంతేకాకుండా తోకకు “ఫిస్” అనే భాగం కూడా ఉంటుంది. వీటన్నింటి కదలికలు విమానాన్ని నడిపే పైలెట్ అధినంలో ఉంటాయి.
గాలి ఒత్తిడి కారణంగా విమానం రెక్కలు విమానాన్ని ఆకాశంలోనికి ఎగిరేలా చేస్తాయి. విమానం మలుపు తిరిగినప్పుడు రెక్కల మీదుండే ఎయిల్ రాన్స్ భాగాలు దాని మార్గం ఒంపు తిరిగేలా చేయగలుగుతాయి. విమానం క్రింద నుంచి పైకి లేచినప్పుడు, నేల మీదకు దిగేప్పుడు అవసరమైన శక్తివంతమైన లిఫ్ట్ ను రెక్కలపై ఉండే “ప్లాప్స్” అనే భాగాలు కలుగజేస్తాయి.
తోక భాగం విమానాన్ని నిశ్చలంగా ఉండేలా చేస్తుంది. చోదకుడు(పైలెట్) రాడర్నీ కుడివైపు గాని, ఎడమవైపు గాని తిప్పగలడు. అతడు దానిని కుడివైపుకు తిప్పినప్పుడు విమానం ఎడమవైపుకు, ఎడమవైపుకు తిప్పినప్పుడు కుడివైపుకి కదులుతుంది. విమానం ముందుకు పోయేటప్పుడు విమానం సమ తూకంలో ఉండేలా “పిన్” అనే భాగం తోడ్పడుతుంది. విమానం వేగంగా ముందుకు పోతున్నప్పుడు అటూ ఇటూ ఊగిపోకుండా “స్టబిలైజర్” అనే భాగం కాపాడుతుంది. ఎలివేటర్స్ అనే తోకలోని భాగాలు స్టబిలైజర్ కు కలపబడి ఉంటాయి. విమానం పైకి లేచేటప్పుడు దానిని నేల నుంచి పైకి లేపెందుకు ఈ భాగాలు ఉపయోగపడతాయి.
గమనిక :
  • మాకు మీ సలహాలు – సూచనలు అవసరం.
  • పై సమాచారం వలన మీకు ఏవైనా ఇబ్బందులు/ నష్టాలు జరిగితే మేము బాధ్యులము కాదు.
  • మేము ప్రచురుణ చేసే వాటిలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని మాకు తెలియజేయండి. అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాము.

దృవిత సైన్స్ ను Follow అవ్వండి
మరిన్ని వివరాల కోసం Druvitha Science ను చూడండి

Comments