What Are The Different Methods Used By The Police To Catch Criminals? | Druvitha Science

Druvitha Science

నేరస్థులను పట్టుకొనేందుకు పోలీసులు ఉపయోగించే వివిధ పద్ధతులేమిటి ?
నేర పరిశోధక శాస్త్రం (Forensic science) సహాయంతో పోలీసులు నేరస్థులను పట్టుకొంటారు. పౌర, నేర శాఖలకు చెందిన న్యాయశాస్త్రం యొక్క సమస్యలకు వైజ్ఞానిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించడమే ఫారెన్ సిక్ సైన్సు అంటారు. వైద్యం, జీవశాస్త్రం, రసాయనశాస్త్రం, ఫొటోగ్రఫీ, డైలస్టిక్స్ వంటి వివిధమైన శాస్త్రాలను ఫారెన్సెక్ శాస్త్రజ్ఞులు వినియోగిస్తారు. ఒక నేరము ఎప్పుడు, ఎలా జరిగిందో నిర్ధరించేందుకు పోలీసులు, ఇతర నేర పరిశోధక సంస్థలతో ఫారెనసిక్ శాస్త్రజ్ఞులు పనిచేస్తారు. నేరం జరిగిన స్థలంలో దొరికిన ఆధారాలను వారు విశ్లేషిస్తారు. వారు చేసే ప్రత్యేక పరిశోధనలు నేరస్థులను పట్టుకునేందుకు బాగా ఉపయోగిస్తుంది.

ఫారెన్ సిక్ సైన్సు యొక్క ముఖ్య అంగం, ఫోరెన్సిక్ మెడిసిన్. బలప్రయోగంతో జరిగిన చావు లేదా గాయము వంటి వాటి విషయములో నేరస్థులను కనుగొనేందుకు ఇది బాగా ఉపయోగిస్తుంది. అసహజ కారణాల వల్ల ఒక వ్యక్తి మరణించినట్లు అనుమానము కలిగినప్పుడు వైద్యుడు ఆతడి దేహాన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తాడు. అతడు మరణించి ఎంత కాలం అయ్యిందో ఫారెన్ సిక్ వైద్యుడు చెప్పగలడు. మృత దేహం యొక్క ఉష్ణోగ్రతను బట్టి అతడు మరణించిన సమాయాన్ని నిర్ధారిస్తారు. మామూలు పరిస్థితులలో మృతదేహం ఒక పద్ధతిలో కొంత వేగముతో చల్లబడుతుంది. దీనినిబట్టి ఆ వ్యక్తి ఎప్పుడు మరణంచాడో ఉజ్జాయింపుగా నిరయిస్తాడు. కానీ ఆ వ్యక్తి మరణించి చాలా కాలం అయితే అతడు మరణించిన కాలాన్ని నిరయించేందుకు ఇంకా క్లిష్టమయిన పద్ధతులను వాడతారు.

ఒక వ్యక్తి మరణించడానికి గల అసలు కారణాన్ని ఫారెన్ సిక్ వైద్యుడు కనుగొనగలడు. ఆ వ్యక్తి కత్తిపోటు వల్ల మరణిస్తే ఆ కత్తి యొక్క ఆకారము, పరిమాణము వారు చెప్పగలరు. అలాగే ఆ గాయము కత్తి, బాకు లేక ఎటువంటి ఇతర మోటు ఆయుధములతో కలిగినా వారు ఆ ఆయుధాన్ని నిర్ధారించగలరు. పిస్తోలు ప్రేలుడు వల్ల గాయము సంభవిస్తే, బాలిస్టిక్ ప్రవీణులతో కలిసి తుపాకి గుండు పరిమాణము, దాని శక్తి వంటి అంశాలను వైద్యులు నిర్ధారిస్తారు. ఆ గుండు ఎంత దూరము నుండి పేల్చబడిందో, అది ఏ కోణములోంచి వచ్చి శరీరంలోకి చొచ్చుకుందో కూడా నిర్ణయించగలరు. తుపాకీ యొక్క నిర్మాణము గురించి తెలుసుకునేందుకు మైక్రోస్కోపులో గుళ్ళను పరీక్షిస్తారు. చాలా తుపాకీల గుర్తులు వాటి నుండి వెలువడ్డ గుళ్ళుపై వుంటాయి.
ఫారెస్ సిక్ శాస్త్రజ్ఞులు అనేక రసాయన పద్ధతులను కూడా వాడతారు. ఒక వ్యక్తిని కారు గుద్ది నప్పుడు ఆతడి శరీరములోకి జొరబడిన కొద్ది పెయింట్ శకలాలతో ఆ కారు ఏ సంవత్సరములో తయారు చేయబడిందో, ఏ మోడలు వంటి అంశాలను కూపీ తీయగలరు. దొంగ సంతకాల విషయములో కాగితము, ఇంకులను బట్టి నేర పరిశోధన చేస్తారు. కాగితములో వుండే 'వాటర్ మార్క్' అనే వ్యాపార గుర్తులను బట్టి శాస్త్రజ్ఞులు, డిటెక్టిన్లు ఎప్పుడు, ఎక్కడ ఆ కాగితము కొనబడిందో నిర్ణయించగలరు.

అలాగే ఇంకు గుర్తులను బట్టి ఆ ఇంకు ఎక్కడ కొనబడిందో నిర్ణయిస్తారు. బట్టల మీద, నేరము జరిగిన స్థలములోని ఇతర ప్రాంతాలలో పడిన రక్తపు మరకలు నేరస్థుడికి సంబంధించిన అమూల్యమైన సమాచారాన్ని అందజేస్తాయి. నేరస్థుడి చొక్కాపై అంటుకొన్న కొద్దిపాటి దుమ్ము లేక అతడి బూటుకు అంటు కున్న బురద వంటి వాటి సహాయముతో నేరము ఎక్కడ జరిగిందో నిర్ణయించగలరు. అలాగే వేలిముద్రలు కూడా నేరస్థుడి గురించి ముఖ్యమైన అంశాలను తెలియజేస్తాయి.

ఒక్కొక్కసారి నేరస్థుల వేలముద్రలు తలుపు పిడిల మీద, గ్లాసుల మీద దొరుకుతాయి. అతి మెత్తటి పొడిని వాటి మీద చల్లి, ఆ వేలిముద్రలను కాగితాల మీదకి బదిలీ చేస్తారు. ఏ ఇద్దరి వేలిముద్రలు ఒకేలా వుండవు గనుక, అవి నేరస్థుడిని పట్టుకోవడములో బాగా ఉపయోగపడతాయి.

నేర పరిశోధనలో వాడే మరో పద్ధతి ఫొటోగ్రఫి. కళ్ళు పట్టుకోలేని ముఖ్యమైన అంశాలను ఫొటోలో బంధించగలుగుతుంది. కెమెరా. ఇన్ ఫ్రా రెడ్, ఆల్ట్రా వయొలెట్ కిరణములను, ఎక్స్ రేలను కూడా ఫారెన్ సిక్ శాస్త్రజ్ఞులు నేర పరిశోధనలో ఉపయోగిస్తారు.

అదే విధంగా దాదాపు 10 సంవత్సరాల క్రితం వచ్చిన ఆధార్ గురించి మనకు తెలిసిందే!
ఈ ఆధార్ నమోదు ప్రక్రియలో మన వ్యక్తిగత ఆధారాలతో పాటు మన వేలిముద్రలు(Biometric) మరియు కళ్ళను(Iris recognition) కూడా స్కాన్ చేసుకుంటారు. ఈ మొత్తం సమాచారం ప్రభుత్వం యొక్క అధినంలో ఉంటుంటి. కావున దేశంలో ఉన్న దాదాపు ప్రతి ఒక్కరి పూర్తి వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నట్లే. ఎవరైనా ఎక్కడైనా ఏదైనా నేరము చేస్తే అక్కడ లభించే ఆధారాలలో వేలిముద్రలు కూడా దొరుకుతాయి. ఈ వేలిముద్రలను ఇది వరకే ఉన్న డేటాతో(ఆధార్ నమోదు ప్రక్రియలో ఇచ్చినవి) పోల్చి చూస్తారు. అలాగే కళ్ళను కూడా స్కాన్ చేసి తెలుసుకుంటారు. అందుకే ఈ మధ్య నేరం జరిగిన అతి కొద్ది రోజులలోనే నేరస్తులను పట్టుకుంటున్నారు.

అదే విధంగా CCTV ఫుటేజ్  మరియు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ద్వారా నేరస్తుడు ఏ ఏ ప్రదేశాలలో తిరిగాడో/తిరుగుతున్నాడో GPS(Global Positioning System) ద్వారా తెలుసుకుంటారు. మొబైల్ నెంబర్ ద్వారా కూడా నేరస్తుల సమాచారాన్ని గుర్తించడానికి ప్రస్తుత టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఏది ఏమైనా నేరస్తుడు తప్పించుకునే అవకాశాలు ప్రస్తుత పరిస్థితులలో లేనేలేవు.

గమనిక :
  • మాకు మీ సలహాలు – సూచనలు అవసరం.
  • పై సమాచారం వలన మీకు ఏవైనా ఇబ్బందులు/ నష్టాలు జరిగితే మేము బాధ్యులము కాదు.
  • మేము ప్రచురుణ చేసే వాటిలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని మాకు తెలియజేయండి. అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాము.


దృవిత సైన్స్ ను Follow అవ్వండి
మరిన్ని వివరాల కోసం Druvitha Science చూడండి

 Whatsapp Facebook

Comments

Post a Comment

Feel Free To Leave A Comment