Instagram Reels Launched In India|Tiktok|Druvitha Science

Druvitha Science


మన దేశంలో గత కొన్ని రోజుల క్రితం TikTok తో పాటు మరో 58 అప్లికేషన్లు(మొత్తం 59) బ్యాన్ చేసిన విషయం తెలిసిందే! అయితే దీని వలన అందరికంటే టిక్ టాక్ యూజర్స్ కి మాత్రం చేదు అనుభవంగా మారింది. టిక్ టాక్ కు బదులుగా ఇండియాలో ఉన్న కొన్ని అప్లికేషన్లు(Chingari, Mitron, Roposo, Moj) వాడుతున్నప్పటికీ వారిలో మాత్రం ఎలాంటి సంతృప్తి కలగట్లేదు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా సామాజిక మధ్యమంగా చెలామణి అవుతున్న Instagram గురించి మనందరికీ తెలిసిన విషయమే!
ఈ నేపథ్యంలో TikTokకి ప్రత్యామ్నాయంగా వియోగాదరుల్లో అసంతృప్తిని తొలగించడం కోసం Instagram సంస్థ “ Reels” అనే సదుపాయాన్ని మన దేశంలో 08-06-2020 రోజున, రాత్రి 7:30లకి అందించబోతుంది. దీనిలో టిక్ టాక్ మాదిరిగానే వీడియోలు చేసుకోవచ్చు. దీని కోసం  ప్రత్యేకమైన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవలసిన అవసరం లేదు.
ఇది వరకే ఉన్న Instagram అప్లికేషన్లో ఈ సదుపాయాన్ని పొందుపరిచారు. ఇది ఒక మంచి విషయంగా చెప్పవచ్చు. ఇంతక ముందు నుంచి Instagram వాడుతున్న యూజర్లకి మరియు కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకొని వాడుకోవడానికి ఈ అవకాశం ఇంస్టాగ్రం అందిస్తుంది.
ఈ “Instagram Reels”లో వీడియో రికార్డు చేసి కావలసిన రకరకాల ఎఫెక్ట్స్ వీడియోకి ఇవ్వొచ్చు. అదే విధంగా వీడియోని అనేక బాగాలుగా కట్ చేసుకోవచ్చు, కావలసిన చోటా స్లో మోషన్ ఎఫెక్ట్ అందించవచ్చు. అలాగే వీడియోకి కావలసిన ఆడియోని కూడా జత చేయవచ్చు. అయితే దీనిలో(Instagram Reels) కేవలం 15 సెకన్ల వీడియో మాత్రమే రికార్డు చేసుకునే అవకాశం కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులలో ఈ సదుపాయం రావడం TikTok యూజర్లకి మాత్రం మంచి విషయం.
Instagram Reels భారతీయులని ఎంతలా అలరిస్తుందో ఇక వేచి చూడాల్సిందే!
Instagram Reels అనే సదుపాయాన్ని మొదటగా మన దేశంలో తీసుకురావడం జరుగుతుంది. దీని వెనుక అసలు కారణం ప్రస్తుతం చైనాకి సంబందించిన Tiktok బ్యాన్ చేయడంతో దాని యూజర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఆ సంస్థ మొదటగా ఇక్కడ విడుదల చేయడం జరుగుతుంది.
అదే విధంగా గత వారంలో ఇదే రోజున చైనాకి సంబంధించిన 59 అప్లికేషన్లు సరిగ్గా 7:30లకి మన దేశంలో బ్యాన్ చేసిన సంగతి మనకు తెలుసు అదే రోజు అదే సమయానికి Instagram ఈ సదుపాయాన్ని మన దేశంలో విడుదల చేయడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

గమనిక :
  • మాకు మీ సలహాలు – సూచనలు అవసరం.
  • పై సమాచారం వలన మీకు ఏవైనా ఇబ్బందులు/ నష్టాలు జరిగితే మేము బాధ్యులము కాదు.
  • మేము ప్రచురుణ చేసే వాటిలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని మాకు తెలియజేయండి. అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాము.


దృవిత సైన్స్ ను Follow అవ్వండి
మరిన్ని వివరాల కోసం Druvitha Science చూడండి

 druvithascience druvithascience

Comments

Post a Comment

Feel Free To Leave A Comment