Alternative Apps For Chinese Apps In India | China Apps | Druvitha Science
ప్రస్తుతం ఇండియాలో చైనాకు చెందిన 59 అప్లికేషన్లు బ్యాన్ చేసిన సంగతి
తెలిసిందే.....వాటిలో కొన్ని అతి ముఖ్యమైనవి కూడా ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి
వాడుతున్న అప్లికేషన్లపై ఒక్కసారిగా నిషేధం విధించడంతో కొన్నీ ఇబ్బందులు
ఎదుర్కొవడం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో బ్యాన్ చేయబడిన అప్లికేషన్లకు ప్రత్యామ్నాయంగా
కొన్ని అప్లికేషన్లు ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా శక్తివంతవంతంగా
పనిచేస్తాయని చెప్పుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Chingari
టిక్ టాక్ ను ఇండియాలో బ్యాన్ చేయడంతో రోజు ఎదో ఒక వీడియో పెట్టే వాళ్ళకి ఇప్పుడు ఎం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నారు మన టిక్ టాక్ ప్రియులు. అలాంటి వారి కోసం దాదాపు టిక్ టాక్ లో ఉండే సదుపాయాలతో మన ఇండియాలోని బెంగళూరుకు చెందిన వ్యక్తులు తయారు చేసిన Chingari అనే ఆప్ చాలా ఉపయోగపడుతుంది. టిక్ టాక్ బ్యాన్ తో అసంతృప్తి చెందిన వారు దీని వాడుతూ సంతృప్తి చెందవచ్చు.
Microsoft Office/Office Lens/ Adobe Scan
ఏదైనా సర్టిఫికెట్/ క్లాస్ రూమ్ నోట్స్/ఫొటోస్ స్కాన్ చేసి పిడిఎఫ్ రూపంలోకి మార్చుకోవడానికి చేయడానికి ఎక్కువగా Cam Scanner వాడేవారు. గత కొన్ని రోజుల క్రితం ఇండియాలో దీనిని బ్యాన్ చేయడం ద్వారా వినియోగదారులకి ఇబ్బందులు ఎదురవ్వడం జరుగుతుంది. కావున దీనికి బదులుగా ప్రపంచలో అతిపెద్ద సంస్థ అయిన మైక్రోసాఫ్ట్ కు చెందిన Microsoft Office అనే అప్లికేషన్ స్కాన్ చేసుకోవడానికి మాత్రమే కాకుండా వివిధ రకాల ఫైల్స్ అంటే Word - PowerPoint - Excelతో పాటు అనేక రకాల సదుపాయాలు ఉన్నాయి.
దీనిలో ఒక ఫోటో పైన ఉన్న టెక్స్ట్ ని
కాపీ చేసుకోవాడిని ఏదైనా డాక్యుమెంట్ ని పిడిఎఫ్ గా మార్చుకోవడానికి చాలా బాగా
ఉపయోగపడుతుంది.
ఇదే సంస్థకు చెందిన Office Lens మరియు
Adobe Scan అనే అప్లికేషన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
కాకపోతే వీటిలో కేవలం స్కాన్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతాయి. కానీ పైన
తెలిపిన మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లో వీటి కంటే ఎక్కువ సదుపాయాలు ఉన్నాయి. మీ అవసరాని
బట్టి కావలసిన ఆప్ డౌన్లోడ్ చేసుకోండి.
Chrome/Firefox
నెట్ లో ఏదైనా సమాచారాన్ని వెతకాలంటే గత కొన్ని రోజుల క్రితం వరకు ఎక్కువగా UC Browser వాడే వాళ్ళు ప్రస్తుతం దీనిపై కూడా నిషేధం విధించడంతో కొంత ఇబ్బందికరంగా మారింది. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా గూగుల్ సంస్థకు చెందిన క్రోమ్ బ్రౌజర్నీ వాడుకోవచ్చు. అలాగే దీనితో పాటు మోజిల్ల ఫైర్ ఫాక్స్ బ్రౌసర్ కూడా ఉపయోగించవచ్చు.
దీనిలో UC Browser లో ఉన్న సదుపాయాల కంటే ఎక్కువనే ఉన్నాయి. అలాగే యాడ్స్ బ్లాక్
చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.
Files By Google
File Manager/File Explore r/File అనే ఆప్స్ మన ఫోన్లో ఉన్న ఫైల్స్ ని(ఫోటోలు, ఆడియో-వీడియో ఫైల్స్ మరియు డాకుమెంట్స్) సులభంగా ఓపెన్ చేయడానికి మరియు స్టోరేజ్ సమాచారాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. అయితే ఈ ఆప్స్ కంటే ఎక్కువ సదుపాయాలు కలిగిన EX File Explorerను వాడతారు. అయితే ఇది ఇండియాలో బ్యాన్ చేయడానికి ముందు వాడేవారు. ఇది ఇప్పుడు లేదు కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా గూగుల్ కు చెందిన File By Google అనే ఈ అప్లికేషన్ వాడుకోవచ్చు. ఇది మరో ప్రత్యేకతను కూడా కలిగి ఉంది. అనవసరమైన ఫైల్స్ ని తొలగించుకొని ఫోన్ స్టోరేజ్ ని పెంచుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఒక ఫోన్ నుంచి మరొక్క ఫోన్లోకి ఫైల్స్ పంపుకోవడానికి వాడుకోవచ్చు.
Jio Switch
మనం ఒక ఫోన్ నుంచి మరొక్క ఫోన్ లోకి ఫొటోస్, ఆడియోస్, వీడియోస్, డాకుమెంట్స్ ఇలా మనకు కావలసిన వాటిని Share It ఆప్ ద్వారా పంపుకునే వాళ్ళం ఇప్పుడు లేదు కాబట్టి చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన ఇండియాకు చెందిన జియో సంస్థ నుంచి తయారు చేయబడిన జియో స్విచ్ అప్లికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది share it కి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు.
దీనితో గూగుల్ నుంచి విడుదలైన Files By Google ద్వారా కూడా ఒక ఫోన్ నుంచి మరొక్క ఫోన్
లోకి ఫొటోస్, ఆడియోస్, వీడియోస్, డాకుమెంట్స్ ఇలా మనకు కావలసిన వాటిని
పంపుకోవచ్చు
క్రింది లింక్స్ ద్వారా ఆప్స్ డౌన్లోడ్ చేసుకొండి.
- Microsoft Office
- Office Lens
- Adobe Scan
- Chingari
- Files By Google (File Manger)
- Jio Switch
- Chrome Browser
- Firefox Browser
గమనిక :
- మాకు మీ సలహాలు – సూచనలు అవసరం.
- పై సమాచారం వలన మీకు ఏవైనా ఇబ్బందులు/ నష్టాలు జరిగితే మేము బాధ్యులము కాదు.
- మేము ప్రచురుణ చేసే వాటిలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని మాకు తెలియజేయండి. అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాము.
దృవిత సైన్స్ ను Follow అవ్వండి
మరిన్ని వివరాల కోసం Druvitha Science ను
చూడండి

Comments
Post a Comment
Feel Free To Leave A Comment