World Environment day 2020 In Telugu | Environment Day | Druvitha Science
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ పర్యావరణ దినోత్సవం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీచే 1972, జూన్ 5వ తేదీన స్థాపించబడింది. పర్యావరణ దినోత్సవం సందర్భంగా, ప్రతి సంవత్సరం జూన్ 5న ప్రపంచంలో ఏదైనా ఒక నిర్ణీత నగరంలో పర్యావరణానికి సంబంధించిన అంతర్జాతీయ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పర్యావరణ కాలుష్యం దాని వలన కలిగే అనార్థల గురించి మరియు పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకోవలసిన జాగ్రత్తల (నివారణ చర్యలు) గురించి చర్చిస్తారు.
ఇది ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క చరిత్ర.
ఈ పర్యావరణం ప్రాముఖ్యత, కాలుష్యం చెందడానికి గల కారణాలు మరియు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి 10వ, తరగతి చదువుతున్న విద్యార్ధిని తెలియజేస్తున్న అంశాలు
పర్యావరణ కాలుష్యం ముఖ్యంగా ప్లాస్టిక్, పరిశ్రమల వాహనాల నుండి వెలువడే వ్యర్థ పదార్థాలతో పాటు విష వాయువుల వలన పర్యావరణం కాలుష్యం అవుతుంది. కావున ప్రస్తుతం ఈ పర్యావరణం కాపాడుకోలేని స్థితికి వచ్చింది. ఇది ఇలాగే ఉంటే పూర్తిగా నాశనం అవుతుంది అందుకే పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత భూమిపై ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది.
పర్యావరణంలో అతి ముఖ్యమైన వనరులు
చెట్లు :
పర్యావరణంలో చెట్లు చాలా ముఖ్యమైనవి. చెట్లు లేకుంటే భూమిపై జీవరాశులకు మనుగడ లేదు. చెట్లు వాతావరణంలో ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చుకొని ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. ఈ ఆక్సిజెన్ ప్రతి జీవి జీవక్రియలు అత్యంత ఆవశ్యకమైనది.
వర్షాలు పడడానికి ఈ చెట్లే కారణం. అలాగే వీటి నుండి ఆహారం అందుతుంది. వైద్య రంగంలో కూడా ఉపయోగపడుతున్నాయి. వీటితో పాటు వివిధ రకాలుగా మన అవసరాలకు అనుగుణంగా మార్చుకొని వినియోగిస్తున్నాము.
చెట్లు ఎలా నాశనం అవుతున్నాయి?
మానవులు విలాసవంతమైన జీవితం కోసం పెద్ద పెద్ద అపార్టుమెంట్లు , భవనాలు, పరిశ్రమలు మొదలగునవి స్థాపిస్తున్నారు. వీటి కోసం అడవులలోని చెట్లను నరికివేస్తున్నారు. ఇలా అడవులను నాశనం చేయడం వలన అక్కడ ఉన్న జీవరాసులు మనుగడ సాగించే అవకాశం లేకుండాపోతుంది. పోయింది కూడా దీని వలన కొన్ని అంతరించిపోయినవి మరికొన్ని అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి. ఈ ప్రభావం మానవులపై కూడా రోజు రోజుకి పడుతూనే ఉంది.
గాలి :
మానవ జీవనానికి గాలి అతి ముఖ్యమైనది. కేవలం మానవ జీవనానికే కాదు అన్ని జీవులకు కూడా అవసరం. గాలి లేనిదే జీవి మనుగడ లేదు. అలాంటిది నేడు పరిశ్రమలు వల్ల వాహనాల నుండి వెలువడే విషవాయువుల వలన కాలుష్యం చెందుతుంది. కలుషితమైన గాలిని పీల్చడం ద్వారా మానవులకు ఎక్కువగా ఊపిరితిత్తులకు సంబంధిత రోగాలు వస్తున్నాయి. విషవాయువుల పరిమాణం పెరిగి ఆక్సిజన్ శాతం తగ్గడం వలన ఇవ్వని సంభవిస్తున్నాయి.
గాలి కాలుష్యం గురించి మరింత సమాచారం
నీరు
మన శరీరంలో నీరు సుమారు 60 శాతం పైగా ఉంటుంది. అంటే నీటికి ఎంత ప్రాముఖ్యత ఉందొ అర్థం చేసుకోవచ్చు. కానీ నేడు పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థ పదార్థాలు నేరుగా నీటిలో కలుస్తున్నాయి. దీని వలన రోజు రోజుకి నీటి కాలుష్యం పెరుగుతుంది. ఇప్పటికి కొన్ని గ్రామాలలోని ప్రజలు చెరువులలో బట్టలు ఉతకడం, పశువులను కడగడం, మల మూత్ర విసర్జనలు చేయడం, వివిధ రకాల వ్యర్థాలను వేయడం మరియు వినాయక చవితి సందర్బంగా రసాయన పదార్థలతో తయారు చేసిన విగ్రహాలను నీటిలో వేయడం ద్వారా నీటి కాలుష్యం జరుగుతుంది. ఈ నీటిని వ్యవసాయానికి ఉపయోగించడం ద్వారా పంట దిగుబడి తగ్గుతుంది అలాగే పండిన పంట వలన లభించిన ఆహారం విషంగా మారుతుంది. అది తింటున్న మనుషులకి జంతువులకి అనేక రోగాలు వస్తున్నాయి. కలుషితం చెందిన నీటిని తాగి జంతువులు అనారోగ్యం భారిన పడుతున్నాయి. కొన్ని చనిపోతున్నాయి.
జలమే జీవనము ( నీటి ప్రాదాన్యత ఎంత ఉంది?)
నేల
ఈ నేలని మన దేశంలో 'భూమాత'గా వర్ణిస్తారు. ఎందుకంటే దీనిపైననే ప్రతి జీవి మనుగడ కొనసాగుతుంది. ఇంత ప్రాధాన్యత కలిగిన భూమిని వివిధ రకాలుగా కలుషితం చేస్తున్నాము. ముఖ్యంగా వాతావరణంలో మార్పుల వలన పెరిగిన భూతాపం, ప్లాస్టిక్ వాడకం (వందల వేల సంవత్సరాలు భూమిలో ఉంటుంది) అలాగే కలుషిత నీటి ద్వారా పండిస్తున్న పంటకు అనేక రకాల తెగుళ్లు వస్తుంటాయి. దీని కోసం వివిధ రకాల రసాయనిక ఎరువులను వాడడం జరుగుతుంది. దీని వలన నేల కాలుష్యం చెందుతుంది. పండించిన పంట కూడా విషతుల్యంగా మారుతుంది.
పర్యావరణంపై టెక్నాలజీ ప్రభావం
టెక్నాలజీని అభివృద్ధి చేసే క్రమంలో పర్యావరణాన్ని కూడా కొంచెం కొంచెం నాశనం చేస్తున్నాము. ఇక్కడ టెక్నాలజీ చెత్తని సృష్టిస్తలేదు ఆ టెక్నాలజీని వాడుతూ మనం చెత్తని సృష్టిస్తున్నాము.టెక్నాలజీ పెరగడంతో కొత్త కొత్త ఉత్పత్తులు అభివృద్ధి చేస్తున్నాము. వీటిలో ముఖ్యంగా వాహనాలు, సెల్ ఫోన్లు, ఫ్రిజులు, కూలర్లు ఇలా వివిధ రకాల పరికరాలను అభివృద్ధి చేసే క్రమంలో పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలు గాలి, నేల మరియు నీరు కలుషితం అవుతున్నాయి. అలాగే రేడియేషన్ పెరగడంతో అనేక రకాలుగా జీవ మనుగడకు ముప్పుగా జరుగుతుంది. ఈ టెక్నాలజీ కేవలం మానవులకే కాదు ప్రతి జీవికి నష్టం జరుగుతుంది.
రేడియేషన్ ప్రభావనాన్ని తట్టుకోలేక ఎన్నో పక్షి జాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. కొన్ని అంతరించిపోయినాయి. వాహనాలు మరియు పరిశ్రమల నుండి వచ్చే తీవ్రమైన శబ్దాల ద్వారా పక్షులకు జంతువులకు ముప్పు కలుగుతుంది.
పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి?
- అధికంగా మొక్కలు నాటడం.
- ప్లాస్టిక్ ని నిరోధించడం.
- నీటి వృధా అరికట్టడం మరియు ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టుకోవడం.
- వాహనాల వాడకం తగ్గించడం, కాలి నడక లేదా సైకిల్ ని ఉపయోగించడం.
- జీవవైవిధ్యంలో భాగమైన వన్యప్రాణులను రక్షించడం.
- సౌర శక్తిని అధికంగా వాడడం
- CNG,LPGతో నడిచే వాహనాలను వినియోగించుకోవాలి లేదా విద్యుత్ వాహనాలను వాడాలి.
- ఫ్యాక్టరీలు పెట్టే ముందు మొక్కలను పెంచిన తర్వాతనే వాటికి అనుమతులు ఇవ్వాలి.
- వ్యవసాయంలో సేంద్రియ ఎరువులు వాడడం లేదా రసాయనిక ఎరువులను తక్కువగా వాడాలి.
- అనవసమైన పనులకి వాహనాలను వాడడం నియంత్రించాలి, నడక లేదా సైకిల్ ను వాడడం మంచిది.
- ప్రజలలో పర్యావరణం అవగాహన కల్పించడం
పర్యావరణ పరిరక్షణకు చేసే నినాదాలు
ప్రజలలో చైతన్యం కలిగించడం కోసం నినాదాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాం
- పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు
- నేటి మొక్క రేపటి వృక్షం
- మొక్కలు నాటుదాం - ఆరోగ్యాంగా జీవిద్దాం
- వాహనాల వాడకం తగ్గిదాం - గాలి కాలుష్యాన్ని నివారిద్దాం
- ప్లాస్టిక్ సంచులు వద్దు - గుడ్డ సంచులు ముద్దు
- పర్యావరణాన్ని మనం రక్షిస్తే - పర్యావరణం మనల్ని రక్షిస్తుంది
- పర్యావరణాన్ని కాపాడుకుందాం - ఆరోగ్యాంగా జీవిద్దాం
By P. Mamatha.,(Chennur).
గమనిక :
గమనిక :
- మేము ప్రచురుణ చేసే వాటిలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని మాకు తెలియజేయండి. అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాము. మాకు మీ సలహాలు – సూచనలు అవసరం.
- సైన్స్ కి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఉంటే రాసి పంపండి. మీ పేరుతో ప్రచురణ చేస్తాం.
దృవిత సైన్స్ ను Follow అవ్వండి

Comments
Post a Comment
Feel Free To Leave A Comment