Why is Plastic Harmful for Environment | Druvitha Science
ప్లాస్టిక్ ఎందుకు
ప్రమాదం? ప్లాస్టిక్ వలన జరుగుతున్న నష్టాలు ఏంటి?
ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ (Plastic) వాడకూడదు అంటారు
ఎందుకు? అసలు ఈ ప్లాస్టిక్ వలన ప్రమాదం ఏంటి? ఇలాంటి ప్రశ్నలు మరెన్నో ఉన్నాయి
వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మన వంటింట్లో కూరగాయలు, మిగిలిన ఆహార పదార్థాల
ఇలా కొంత చెత్త ఏర్పడుతుంది. ఇది బయట వేస్తాము కొన్ని రోజుల తర్వాత అక్కడ ఆ చెత్త
కనిపించదు. ఆ చెత్త సూక్ష్మజీవులు కుళ్ళింపచేసి భూమిలో కలిపేస్తాయి. ఇలాగే జంతు
మరియు వృక్ష సంబంధ వ్యర్థాలను కుడా సూక్ష్మజీవులు నాశనం చేసి నేలలో కలిపేస్తుంటాయి.
ఇలా నేలలో కలిసిపోయే పదార్థాల (Biodegradable Waste) వలన
పర్యావరణానికి ఎలాంటి ప్రమాదం లేదు. కాని ఈ చెత్త అధిక మొత్తంలో చేరితే అక్కడ
హానికరమైన సూక్ష్మజీవులు, దోమలు చేరతాయి వీటి వలన వివిధ రకాల వ్యాధులు
సంక్రమిస్తాయి. (ఉదా: మలేరియా, డెంగ్యు, టైఫాయిడ్).
నేలలో కలిసిపోని చెత్త వలన ఎక్కువ ప్రమాదం ఉంది .
ఆ ప్రమాదమే నేలలో కలవకపోవడం. దీని వలన నేల, నీరు మరియు గాలి కాలుష్యం అవుతుంది. ఈ
కలవని చేత్తనే ప్లాస్టిక్, ఇంకా కొన్ని పదార్థాలు ఉన్నప్పటికీ మొదటికి స్థానంలో
మాత్రం ప్లాస్టిక్ ఉంటుంది. ఎందుకంటే మామూలు కిరణం షాప్ నుంచి షాపింగ్ మాల్స్,
సూపర్ మర్కెట్స్ వరకు ఎక్కడ చుసిన ప్లాస్టిక్ సంచులే కదా వాడుతున్నారు. అలాగే తినే
ప్లేట్, తాగే గ్లాస్ ఇలా అన్ని ప్లాస్టిక్ అందువలన ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్లాస్టిక్
కుప్పలు కుప్పలుగా ఏర్పడింది/ఏర్పుడుతుంది. ప్లాస్టిక్ పదార్థాలను ( Non Biodegradable
Waste) ఏ సూక్ష్మజీవి తినలేదు కావున అది నేలలో కలిసిపోకుండా అలాగే ఉంటాయి.
అక్కడక్కడా త్రవ్వకాలు జరిగినప్పుడు నేల లోపలి వెళ్తుంది తప్పా పూర్తిగా నాశనం
కాదు కొంత లోతున అలాగే ఉంటుంది.
ఇలా నేలలో – నేలపై ఉండడం వలన అనార్థాలు
జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ వ్యర్థాల నుండి విడుదలయే రసాయనాల వలన నేల
కాలుష్యం జరుగుతుంది. అలాగే ప్లాస్టిక్ వస్తువులను ఉత్పత్తి చేసే పరిశ్రమల నుండి
వెలువడే విష పదార్థాలు/వాయువుల వలన గాలి, నీరు కూడా కలుషితం అవుతున్నాయి. ఇది
పర్యావరణంపై అధిక ప్రభావం చూపుతుంది.
భూమిపై ఉన్న జంతువులు, పక్షులు మరియు ఇతర జీవులపై
ప్లాస్టిక్ ప్రభావం
చెత్త కుప్పలపై ఉండే ప్లాస్టిక్ పదార్థాలను
జంతువులు తినడం వలన అవి జీర్ణం చేసుకోలేక వాటి కడుపులో అలాగే ఉండడం వలన
చనిపోతున్నాయి కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఇదే విధంగా పక్షులు,
సరీసృపాలు కుడా ఈ సమస్యని ఎదుర్కొంటున్నాయి. నేలలో ఉండే ఉపయోగకరమైన కీటకాలు,
వానపాముల వంటి జీవులు కూడా చనిపోతున్నాయి.
మనం అందమైన ప్లాస్టిక్ ప్లేట్స్, టిఫిన్
బాక్స్లు, తదితర వంట సామగ్రిని వాడుతున్నాము. ఇలా వాడే వస్తువులకు కొంత వేడికి
గురిచేస్తే వాటి నుండి రసాయనాలు విడుదలై ఆహార పదార్థాలలో చేరుడం వలన ఆరోగ్య
సమస్యలు వస్తున్నాయి. కావున ఈ ప్లాస్టిక్ మానవుల ఆరోగ్యంపై కుడా ప్రభావం
చూపుతుంది.
అలాగే నేలలో కలిసిన ప్లాస్టిక్ నుండి విడుదలయ్యే
రసాయనాలు ఆహార పదార్థాలలో చేరడం వలన ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. చేపలను ఆహారంగా తీసుకోవడం కుడా ప్రమాదమే ఎందుకంటే
వాటిలో అతి సూక్ష్మమైన ప్లాస్టిక్ ఉంటుంది తినడం ద్వారా మనలోకి ప్రవేశించి
ప్రమాదాన్నికి గురిచేస్తుంది. వాటర్ బాటిల్స్ లో నీళ్ళు తాగకపోవడం మంచిది.
సముద్ర జీవులపై ప్లాస్టిక్ ప్రభావం
సముద్ర జీవులపై ప్లాస్టిక్ ప్రభావం అధికంగా ఉందని
చెప్పవచ్చు ఎందుకంటే ప్లాస్టిక్ పదార్థాలు వర్షపు నీటికి కొట్టుకుపోయి చెరువులు,
సరస్సులు, నదులు మరియు సముద్రాలలో అధిక మొత్తంలో చేరుతున్నాయి. ఇలా చేరిన వాటిలో
చిన్న చిన్న ముక్కలు నీటిలో తేలియాడుతూ ఉంటాయి. అక్కడ ఉండే జలచర జీవులు ఆహార
పదార్థాలతో పాటు ఈ ప్లాస్టిక్ ముక్కలను కుడా తింటున్నాయి. దీని వలన అవి అధికంగా
చనిపోయి నీటిపై తేలుతూ కనిపిస్తున్నాయి. మరి కొన్ని అనారోగ్య సమస్యలతో మనుగడ
కొనసాగిస్తున్నాయి.
పర్యావరణంపై ప్లాస్టిక్ ప్రభావం
ప్లాస్టిక్ వస్తువులు తయారు చేసే ఫ్యాక్టరీల
నుంచి వచ్చే విష పదార్థాలు మరియు విషవాయువుల వలన నేల, గాలి మరియు నీరు దాదాపు అంత
కలుషితం అయింది. అందువలన వాతావరణంలో మార్పులు, మొక్కల పెరుదల, జీవుల మనుగడ
అన్నింటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇది
ఇలాగే కొనసాగితే ఈ భూమిపై జీవుల మనుగడ చాలా కష్టతరంగా మారుతుంది.
ప్లాస్టిక్ భూతం వలన అనేక జీవులు ప్రాణాలు
కోల్పోతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులు తగ్గుతున్నాయి. రోజు రోజుకి ఆహారపు కొరత
ఏర్పడుతుంది.
ప్లాస్టిక్ ని ఎలా నిరోదించాలి?
తగ్గించడం (Reduce)
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం లేదా పూర్తిగా
వాడకపోవడం మంచిది.
అలాగే ప్లాస్టిక్ సంచులు వాడేకంటే గుడ్డ సంచులను
లేదా కాగితపు సంచులు వాడడం చాల మంచిది.
ప్లాస్టిక్ ప్లేట్స్, గ్లాసులు, కప్పులు, బదులుగా
పేపర్ ప్లేట్స్, గ్లాసులు మరియు కప్పులు వాడాలి (కాగితాన్ని ఎక్కువ వాడడం కూడా
ప్రమాదకరమే ఎందుకంటే కాగితపు ఉత్పత్తి కోసం అధికంగా చెట్లని నరకాలి)
తిరిగివాడుకోవడం (Reuse)
మనం సూపర్ మార్కెట్, కిరణం షాపులు, బట్టల
దుకాణాలలో మరియు ఇతర షాపులలో ఏదైనా
కొన్నప్పుడు ఇచ్చే ప్లాస్టిక్ సంచిని పడెయ్యకుండా అలాగే పెట్టుకొని అవసరం ఉన్న
చోటా తిరిగి వాడుకోవాలి. ఇలా చేయడం వాళ్ళ కొంత వరకు ప్లాస్టిక్ ని నిరోదించవచ్చు.
పున:చక్రీయ (Recycle)
ఎవైన ప్లాస్టిక్ వస్తువులు పాడైపోయినవి
ఉంటే వాటిని తిరిగి వాడుకునే విధంగా చేసుకోవడం
తగ్గించడం
మరియు తిరిగి ఉపయోగించడం సాధ్యం కానప్పుడు మాత్రమే ఇది సిఫార్స్ చేయబడుతుంది.
తిరిగి తయారు
చేయడం (Recover)
ప్లాస్టిక్
చెత్తని ఇతర అవసరాలకు ఉపయోగించుకోవడం ( విద్యత్, ఇందనాల వంటివి తయారు చేయడంలో
ఉపయోగించడం)
తగ్గించడం (Reduce),
పునర్వినియోగం (Reuse)
మరియు పున:చక్రీయ(Recycle) ప్రయత్నించిన తరువాత వనరుల పునరుద్ధరణ
జరుగుతుంది.
ప్లాస్టిక్ మాత్రమే నేలలో కలవని పదార్ధం కాదు ఇంక కొన్ని పదార్థాలు ఉన్నాయి.
ప్లాస్టిక్ మాత్రమే నేలలో కలవని పదార్ధం కాదు ఇంక కొన్ని పదార్థాలు ఉన్నాయి.
గమనిక :
- సైన్స్ కి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఉంటే రాసి పంపండి. మీ పేరుతో ప్రచురణ చేస్తాం.
- మేము ప్రచురుణ
చేసే వాటిలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని మాకు తెలియజేయండి. అలాంటి తప్పులు జరగకుండా
చూసుకుంటాము. మాకు మీ సలహాలు – సూచనలు అవసరం.
దృవిత సైన్స్
ను Follow అవ్వండి
మరిన్ని వివరాల
కోసం Druvitha Science ను చూడండి

Comments
Post a Comment
Feel Free To Leave A Comment