Why Is Ozone Important? | The Power Of Sun | Telugu | Druvitha Science


Druvitha Science | DruvithaScience

ఓజోన్ ప్రాముఖ్యత ఏంటి?

ప్రకృతిలో ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ప్రతీది గొప్పదే.
భూమికి 150 మిలియన్ కిలో మీటర్ల దూరంలో సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు విడుదల చేసే కాంతి, వేడి (సౌర శక్తి) జీవుల మనుగడకు అతి ముఖ్యమైన వనరులు. అందరు మనం తినే తిండి వలన శక్తి వస్తుందని అనుకుంటారు. కానీ శక్తి ప్రవాహం (Energy Flow) గురించి తెలిసినవారు ఇది తప్పు అని అంటారు. ఎందుకంటే మనం తినే ఆహారం ఉత్పత్తి కావడంలో ప్రధాన పాత్ర సుర్యుడిది ఉంటుంది. మొక్కలు కిరణజన్య సంయోగక్రియ (Photosynthesis) సూర్యుని సమక్షంలోనే జరుపుకుంటాయి. దీని ఫలితంగా ఆహార ఉత్పత్తి అవుతుంది.సూర్యుడు విడుదల చేసే కాంతి, వేడి (సౌర శక్తి) వినియోగించుకొని మొక్కలు ఎదుగుతున్నాయి. భూమిపై జీవుల మనుగడకు అవసరమయ్యే ఆక్షిజన్ ఈ మొక్కల ద్వారానే వస్తుందని మనందరికీ తెలుసు. మొక్కలే లేకుంటే భూమిపై ఆక్షిజన్ స్థాయిని ఎవరు ఉహించలేరు. అలాగే గాలిలో కదలికలు, నీటి ప్రవాహాలు మొత్తం సుర్యునితోనే ముడిపడి ఉన్నాయి. హరిత గృహ వాయువులు భూమి నుండి ఉద్గారం చెందే సూర్యుడి వేడిని బంధించి భూఉపరితలం వెచ్చగా ఉండేలా చేస్తున్నాయి. లేదంటే భూఉపరితలం పూర్తిగా మంచుతో కప్పబడిపోతుంది. దీన్ని ప్రభావం జీవుల మనుగడకు ముప్పు కలిగిస్తుంది. ఋతువులు ఏర్పడాలన్న సూర్యుడు ఉండాల్సిందే అంటే సమస్త ప్రాణులు బ్రతకాలంటే తినడానికి తిండి, పిల్చడానికి గాలి (ఆక్షిజన్), మరియు త్రాగడానికి నీరు ఇలా అనేక వనరులు (బొగ్గు, చమురు, మరియు శిలాజ ఇంధనాలు) ఏర్పడాలన్న సూర్యుడితోనే ముడిపడి ఉన్నాయి.జీవ మనుగడకు ఉపయోగపడుతున్న కాంతి, వేడితో పాటు అతి ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు (UV Rays) కుడా సూర్యుడి నుండే వెలువడుతున్నాయి. ఈ ప్రమాదకరమైన కిరణాలు (అతినీలలోహిత కిరణాలు) భూమిని చేరితే జీవుల మనుగడ సాగదు. వీటి నుండి రక్షణ కల్పిస్తున్నదే ఓసోన్ పొర (Ozone Layer).


ఓసోన్ పొర ఎక్కడ ఉంటుంది?

మనం పీల్చే ఆక్షిజన్ రెండు పరమాణువులను కలిగి ఉంటుంది. ఓజోన్ మూడు పరమాణువులతో ఉంటుంది. వాతావరణంలో ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, థర్మోస్ఫియర్ మరియు ఎక్సోస్ఫియర్ అనే పొరలు ఉంటాయి. వీటిలో ఓజోన్ పొర స్ట్రాటోస్ఫియర్ లో ఉంటుంది. ఇది భూమికి సుమారు 15-30 కి.మీ. దూరంలో ఉంది సూర్యుడి నుండి వెలువడే అతినీలలోహిత కిరణాలను (UV Rays) అడ్డుకుంటుంది. దీనితో పాటు అతి ప్రమాదకరమైన రేడియేషన్ కూడా అడ్డుకొని భూమికి రక్షణ కల్పిస్తుంది.


ఓజోన్ పొర లేకపోతే ఏమవుతుంది?

అతి ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు భూమిని చేరితే మానవులకు చర్మ కాన్సర్లు, కంటి వ్యాధులు మరియు ఈ కిరణాలు DNAలో చేరి జన్యువులను ధ్వంసం చేయడం వల్ల జన్యు సంభందిత వ్యాధులు కలుగుతాయి. అలాగే రోజు రోజుకి జీవులలో రోగనిరోధక శక్తి  క్షీణిస్తుంది. భూమిపై ఉన్న మొక్కలు ఎక్కువ రోజులు జీవించలేవు.


 ఓజోన్ పొర ఎలా నాశనం అవుతుంది?

భూమిపై చేస్తున్న వివిధ మానవ కార్యకలాపాల ద్వారా బ్రోమిన్, క్లోరిన్ మరియు ఎయిర్ కూలర్లు, రిఫ్రిజిరేటర్లు నుండి వెలువడే క్లోరో ఫ్లోరో కార్బన్లు అధిక మొత్తంలో వాతావరణంలోని స్ట్రాటోస్ఫియర్ లోకి విడుదలవుతున్నాయి. అక్కడ ఉన్న ఓజోన్ పొరను నాశనం చేస్తున్నాయి.


ఇవి కూడా చదవండి

గమనిక :
  • మేము ప్రచురుణ చేసే వాటిలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని మాకు తెలియజేయండి. అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాము. మాకు మీ సలహాలు – సూచనలు అవసరం.
  • సైన్స్ కి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఉంటే రాసి పంపండి. మీ పేరుతో ప్రచురణ చేస్తాం.

దృవిత సైన్స్ ను Follow అవ్వండి
మరిన్ని వివరాల కోసం Druvitha Science ను చూడండి


Comments