Mobile Safety Tips | Precautions Of Mobile | Druvitha Science
ఫోన్ వాడడంలో
తీసుకోవలసిన 10 జాగ్రత్తలు
1.ఫోన్
కొనడంలో జాగ్రత్తలు
ఫోన్
కొనే ముందు అది నాణ్యత కలిగినదా? కాదా? అని తెలుసుకొని కొనాలి.వీలైనంత వరకు అధిక
వినియోగదారులు ఉన్న తయారి సంస్థకు చెందిన ఫోన్లు కొనాలి. ధర తక్కువ అని కొని
ఇబ్బందులు పడొద్దు. అలాగే ఎంత మొత్తంలో రేడియేషన్ కలిగిస్తుందో తెలుసుకోవాలి. దీని
కోసం డబ్బాపై ఉండే SAR
విలువను చూడాలి. ఇది ఉండాల్సిన స్థాయికి మించి ఉండకూడదు.
- Specific Absorption Rate (SAR) : 1.6w/kg కంటే తక్కువ ఉండాలి. (భారత ప్రభుత్వం నిర్దారించిన విలువ)
- మీరు ఇది వరకే కొన్న ఫోన్ SAR
విలువను తెలుసుకోవడానికి *#07# డైల్ చేసి చూసుకోవచ్చు.
2. ఫోన్లో ఎక్కువగా మాట్లాడం
ఎక్కువ
సేపు ఫోన్లో మాట్లాడడం వలన ఫోన్ కొంత వేడెక్కి విద్యుదయస్కాంత వికిరణం (Electromagnetic
Radiation)
వెలువడుతుంది. ఈ రేడియేషన్ (Radio Frequency) మానవునిలో మెదడు సమస్యలు, చర్మ కణాలను నాశనం చేయడం మరియు శ్రావణ సమస్యలు (Ear Problems) వంటి
ప్రమాదాలకు గురి చేస్తుంది. కొన్ని సందర్భాలలో ఎక్కువగా మాట్లాడడం వలన తలనొప్పి,
అలసిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అందుకే వీలైనంత తక్కువ మాట్లాడడం మంచిది.
3. హెడ్
సెట్ – లౌడ్ స్పీకర్ ఉపయోగించడం
ఎక్కువ
సేపు ఫోన్లో మాట్లాడే సందర్బాలలో నాణ్యమైన వైర్ హెడ్ సెట్ (Wired Headset) వాడడం
లేదా లౌడ్ స్పీకర్ని ఉపయోగించడం చాలా మంచిది. ఇలా వాడడం వలన కొంత వరకు విద్యుదయస్కాంత వికిరణం (Electromagnetic
Radiation)
తగ్గించవచ్చు. అలాగే ఫోన్ కూడా మెదడుకు కొంత దూరంలో ఉంటుంది కాబట్టి ప్రమాదం
కూడా తక్కువగా ఉంటుంది.
వైర్ లెస్ హెడ్ సెట్ (Wireless Headset) తక్కువ రేడియేషన్ విడుదలచేసినప్పటికీ
వాడకపోవడం మంచిది. ఎందుకంటే అది కూడా మెదడుకు దగ్గరగా ఉంటుంది. దీన్ని కూడా వీలైనంత
తక్కువ వాడుకోవాలి ( బైక్,కార్
డ్రైవింగ్ సమయంలో వాడుకోవచ్చు)
4. నిద్రించే
సమయంలో ఫోన్ దూరంగా పెట్టడం
మనలో
ఎక్కువ మంది రాత్రి సమయంలో మాట్లాడడం లేదా చాటింగ్ చేస్తూ నిద్ర వచ్చిన వెంటనే అలాగే
పక్కన పెట్టుకొని నిద్రపోతారు. ఇది మరి ప్రమాదకరం ఎందుకంటే సెల్ ఫోన్ టవర్స్, ఫోన్ల మద్య నిరంతరం సిగ్నల్స్ రవాణా జరుగుతూనే
ఉంటుంది. మెదడు కొంత విశ్రాంతి సమయంలో ఉంటుంది కాబట్టి మెదడుపై ఈ ప్రభావం పడుతుంది.
5. అనవసరమైన
కనెక్షన్స్ ఆఫ్ చేయడం
నిద్రించే
సమయంలో లేదా ఏదైనా పనిలో ఉండి ఫోన్ వాడనప్పుడు అనవసరమైన కనెక్షన్స్ (Data, Wi-fi and Automatic Services) ఆఫ్
చేయడం. దీని
వలన డేటా ఖర్చు తగ్గుతుంది. బ్యాటరి ఆదా అవుతుంది మరియు కొంత రేడియేషన్ కుడా తగ్గుతుంది. ఎయిర్
ప్లేన్ మోడ్ లో పెట్టుకోవడం ఇంకా మంచిది.
6. కళ్ళని కాపాడుకోవడం
మనంలో చాలా మంది ఎక్కువ సమయం ఫోన్ వాడడం
వలన అంటే వీడియోలు చూడడం, చాటింగ్ చేయడం, మరియు ఆటలు ఆడడం చేస్తుంటారు. ఈ సమయంలో కళ్ళు బాగా పని చేస్తాయి.
అప్పుడు మొబైల్ స్క్రీన్ నుండి వెలువడే నీలి రంగు కాంతి కళ్ళను పాడు చేస్తుంది.
అందుకే అప్పుడప్పుడు కళ్ళు మంటలు/ ఎర్రబడడం, కళ్ళలో నీళ్ళు మరియు ఇతర సమస్యలు
వస్తుంటాయి. దీనిని నిరోదించడానికి ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ప్రతి ఫోన్లో
కొన్ని సదుపాయాలు(Reading Mode, Eye Protect, Eye Comfort, Blue
Light Filter etc.) ఉన్నపటికీ
అదే పనిగా వాడడం వలన ఎక్కువగా కంటి సమస్యలు వస్తున్నాయి. కొన్ని సందర్బాల్లో కంటి
చూపు పోయే అవకాశం కూడా ఉంది. అలాగే చీకట్లో ఫోన్ వాడడం కూడా ప్రమాదకరమే.
నీలి రంగు కాంతిని (Blue Light) నిరోదించే కొన్ని రకాల ఆప్స్ గూగుల్
ప్లే స్టోర్ ఉన్నాయి. వాటిని డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు ((Reading
Mode, Eye Protect, Eye Comfort, Blue Light Filter అనే పేర్లతో ఉంటాయి)
7. సిగ్నల్స్ అందుబాటులో లేని సమయం
ఈ సమయంలో సిగ్నల్స్ కోసం ఫోన్లో
ఉండే సిగ్నల్ రిసివర్స్ ఎక్కువగా పని
చేస్తుంటాయి. అప్పుడు కొంత రేడియేషన్ విడుదలవ్వడం, వేడెక్కడం మరియు బ్యాటరి తగ్గడం
జరుగుతుంటాయి. కాబట్టి ఆ సమయంలో ఫోన్ వాడకూడదు. ఫోన్ ఆఫ్ చేయడమే ఉత్తమం.
8. అనవసరమైన
ఆప్స్ తొలగించడం
ఫోన్
కొన్నప్పుడు లేదా మనమే తెలిసి తెలియక అనవసరమైన ఆప్స్ డౌన్లోడ్ చేస్తుంటాము. అవి
నిరంతరం బ్యాక్ గ్రౌండ్లో పని చేస్తూనే ఉంటాయి. దీని వల్ల ఫోన్ బ్యాటరి
తగ్గుతుంది. కొన్ని తెలియని ఆప్స్ వలన సెక్యూరిటీ సమస్యలు కూడా వస్తుంటాయి. కావున అప్పుడప్పుడు
ఫోన్లో అవరసమైనవి ఏవి?
అనవసరమైన ఏవి? అని చూసుకొని తొలగించడం మంచిది. తొలగించడం వల్ల ఫోన్ స్టోరేజ్ మరియు
ఫోన్ పనితీరు కూడా పెరుగుతుంది.
9.
సైబర్ క్రైమ్ నుండి రక్షణ పొందడం
నేడు
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ అంత ఇంత కాదు అన్నింటిని మన చేతుల్లో పెట్టింది.
దీన్ని కొంత మంది సైబర్ నేరగాళ్ళు వివిధ రకాల మెసేజ్లు, ఆప్స్
మరియు లింక్స్ సృష్టించి వాటిని మనకు తెలియకుండానే ఫోన్లో డౌన్లోడ్ చేయడం లేదా
మనమే తెలియక డౌన్లోడ్ చేయడం ద్వారా మన వ్యక్తిగత సమాచారం (ఫోటోలు,
వీడియోలు,
మెసేజ్లు) దొంగిలించి వినియోగిస్తున్నారు. మనం అప్పుడప్పుడు చూసే బ్యాంకు మోసాలు
ఎక్కువగా ఈ ప్రక్రియ ద్వారానే చేస్తుంటారు. కావున సామాజిక మాధ్యమాలలో (Whatsapp, Facebook, Instagram etc) వచ్చే
మెసేజ్లు, ఆప్స్
మరియు లింక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి లేదంటే ప్రమాదంలో పడతాము.
సెక్యూరిటీ
సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ఫోన్ మరియు ఫోన్లోని ఆప్స్ ఎప్పుడు అప్డేట్ చేస్తూ
ఉండాలి.
10. ఫోన్
రక్షణ కోసం వాడే కవచాలు ( Tempered Glass, Back Pouch or Case)
ఫోన్
కొన్న వెంటనే స్క్రీన్ ప్రోటేక్టర్ (Tempered Glass), బ్యాక్ పౌచ్ వేస్తుంటారు. ఇవి ఫోన్
కి రక్షణ ఇస్తున్నాయి కాని మనకి కాదు. ముఖ్యంగా బ్యాక్ పౌచ్ వలన ఇబ్బందులున్నాయి.
ఫోన్ క్రింద పడ్డా పగల కూడదని మందంగా/ దృడంగా ఉన్నవి వేస్తారు. వీటి వలనే ఫోన్
సిగ్నల్స్ అందుకోలేకపోవడం జరుగుతుంది. అలాగే ఎక్కువ సమయం వాడడం వలన వేదేక్కుతుందని
మనకు తెలుసూ అ సమయంలో మందంగా/ దృడంగా ఉన్న
పౌచ్ వేడిని అడ్డుకోవడం వలన ఫోన్ అధికంగా వేడెక్కుతుంది లేదా పేలే అవకాశాలు
ఉన్నాయి. కావున తక్కువ మందం కలిన పౌచ్ /కేస్ వాడడం ఉత్తమం.
NOTE : ఫోన్
ప్రభావం చిన్న పిల్లలపై ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఫోన్ ఇవ్వకపోవడం
మంచిది.
వీక్షకులకు విజ్ఞప్తి :
- మేము ప్రచురుణ చేసే వాటిలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని మాకు తెలియజేయండి. అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాము. మాకు మీ సలహాలు – సూచనలు అవసరం.
- సైన్స్ కి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఉంటే రాసి పంపండి. మీ పేరుతో ప్రచురణ చేస్తాం.
మరిన్ని వివరాల కోసం Druvitha Science ను
చూడండి

Comments
Post a Comment
Feel Free To Leave A Comment