How To Send Photos Without Losing Quality In WhatsApp | DruvithaScience
మన
నిత్య జీవితంలో WhatsApp ఒక
భాగమైనది. ఇది మనం మన వాళ్ళతో దూరంగా ఉన్న దగ్గరగా ఉన్నాం అనే అనుభూతిని
కలిగిస్తుంది. ప్రతిరోజు మెసేజ్స్, ఆడియో – వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుతుంటాము. అలాగే
ఫొటోస్,
వీడియోస్, ఆడియో
మరియు కొన్ని సందర్భాలలో డాకుమెంట్స్ కూడా పంపుతుంటాము. అయితే ఇక్కడ ఏది పంపిన
ఇబ్బంది ఉండట్లేదు కాని ఫొటోస్ పంపినప్పుడే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది.
ఎందుకంటే మనం మన మిత్రునికి పంపే ఫోటో తనకి చేరిన వెంటనే ఫోటో క్వాలిటి చాలా వరకు
తగ్గుతుంది. దీని వలన ఇష్టమైన ఫోటో కాస్త క్వాలిటి తగ్గడంతో చూడడానికి అంత బాగా
అనిపించదు/కనిపించదు. కావున ఇలా జరగుకుండా పూర్తి క్వాలిటితో మన స్నేహితులతో
పంచుకోవచ్చు. అది ఎలా పంపాలో ఇప్పుడు చూద్దాం.
STEP - 1
మీరు పంపాలిసిన
వ్యక్తి యొక్క వాట్సప్ నెంబర్ ఓపెన్ చేసి అందులో Attached File Button నొక్కండి.
STEP – 2
Document అనే
బటన్ నొక్కండి
STEP – 3
Browse Other Docs అనే దానిపై
క్లిక్ చేయండి
STEP – 4
Image Folder ను
సెలెక్ట్ చేసుకోండి
STEP – 5
ఇప్పుడు
మీ ఫోన్లో ఫొటోస్ తో ఉన్న ఫోల్డర్స్ కనిపిస్తాయి అక్కడ మీకు కావలసిన ఫోటోను
ఎంచుకొని దానిపై నొక్కండి(క్లిక్ చేయండి)
STEP – 6
మీకు
కావలసిన ఫోటోపై నొక్కిన వెంటనే ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది Send
చేయాలా? వద్దా? అని
వస్తుంది Send
చేస్తే ఫోటో వెళ్ళిపోతుంది.
- ప్రతి ఫోన్లో దాదాపు ఇలాగే ఉంటది. కొన్ని ఫోన్లో కొన్ని మార్పులు ఉండొచ్చు కానీ చేసే పని మాత్రం ఇదే!
గమనిక :
- మాకు మీ సలహాలు – సూచనలు అవసరం.
- పై సమాచారం వలన మీకు ఏవైనా ఇబ్బందులు/ నష్టాలు జరిగితే మేము బాధ్యులము కాదు.
- మేము ప్రచురుణ చేసే వాటిలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని మాకు తెలియజేయండి. అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాము.
దృవిత సైన్స్ ను Follow అవ్వండి
మరిన్ని వివరాల కోసం Druvitha Science చూడండి








Wonderful bro
ReplyDelete