Amazing Animals From Around The World | Druvitha Science
ప్రకృతి
అంటేనే ఒక ప్రత్యేకమైనది. అందులో ఉండే జీవులు కూడా ఒక్కొక్కటి ఒక ప్రత్యేక
లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఆ లక్షణాలు వాటి మనుగడకు అన్ని విధాలుగా
ఉపయోగపడుతుంటాయి. అలాంటి ప్రత్యేక లక్షణాలు కలిగిన కొన్ని జీవుల గురించి
తెలుసుకుందాం.
నిజంగా ఇదొక విచిత్ర ప్రాణి. దీని జీవితంలో రెండే దశలు ఉంటాయి. ఒకటి గాఢంగా నిద్రించే సమయం. రెండు అంతగా నిద్రించని సమయం. దాదాపు 20 గంటలు ఏకబిగిన గాఢనిద్ర పోతుంది. స్లాత్ అనే ఈ జంతువు తన జీవితకాలం 30 ఏళ్లలో 25 ఏళ్లు నిద్రలోనే గడిపేస్తుంది. చెట్ల కొమ్మలకు తలకిందులుగా వేలాడుతూనే కునుకు తీయడం దీన్ని మరో ప్రత్యేక లక్షణం. మూడేసి లేదా రెండేసి వేళ్లే ఉండే దీని కాళ్ళు కొమ్మలను కరచుకొని ఉంటాయి. నిద్ర లేచినప్పుడు సైతం స్లాత్ ఇలా తలకిందులుగానే ఉంటుంది. మగత నిద్రలోనే ఆకులను అతి నిదానంగా వాటిని దగ్గరకు లాక్కొని అంతకంటే నిదానంగా వాటిని తింటుంది. ఆకుల కోసం కొమ్మల మీద అటూ ఇటూ తిరుగుతుంది. ఆ తలకిందులుగా నడక వేగం నిమిషానికి 14 మీటర్లు కుడా ఉండదు. గంటకు సుమారు అర కిలోమీటర్ ప్రయాణిస్తుంది. స్లాత్ చెట్టు దిగడమంటే గొప్ప విశేషమే!
చాలా నెమ్మదిగా, చాలా జాగ్రత్తగా, తూలుతూ సోలుతూ నేల మీదకు దిగుతుంది.
అది అప్పుడప్పుడు మకాం మార్చుతూ ఉంటుంది. ఇలా నేల మీదకొచ్చినప్పుడే స్లాత్
నిటారుగా ఉంటుంది. పక్కనే నది లేదా వాగు ఉంటే దానిలో దిగి కుక్క మాదిరిగా ఈదుకుంటూ
అవతలి ఒడ్డున ఉన్న చెట్టు వద్దకు చేరుతుంది. నడకతో పోల్చితే ఈత స్పీడ్ ఎక్కువనే
ఉంటుంది. ఇక స్లాత్ జీర్ణక్రియ కుడా అంతే నిదానంగా జరుగుతుంది. మల మూత్ర విసర్జన
వారానికోసారి ఉంటుంది. ఇంత బద్దకస్తురాలైన సోమరి జంతువు కాబట్టే, అతి సోమరితనానికి
దాని పేరే స్థిరపడింది. ఈ జంతువులు సెంట్రల్ అమెరికాలో, సౌత్ అమెరికాలో కనిపిస్తాయి.
ఆ కప్ప పిల్లల
జననం నోటి నుంచే!
ఆస్ట్రేలియాలోని క్విన్స్ ల్యాండ్
ప్రాంతం ఆ కప్పల ఆవాసం. వాటికో ప్రత్యేకత ఉంది. ప్లేటిపస్ అనే కప్పలూ ఇతర కప్పల్లాగే
గుడ్లు పెడతాయి. అయితే, ఆడ కప్ప తన గుడ్లను తానే మింగేస్తుంది. అలా మింగిన గుడ్లను
కడుపులోనే పొదుగుతుంది. వాటి నుంచి తలకప్పలు పుట్టి కడుపులోనే చిరు కప్పలుగా
పెరుగుతాయి. ఈ చిరు కప్పలు తల్లి నోటి నుంచి భూమి మీద పడి కళ్ళు తెరుస్తాయి. ఈ
తరహాలో బిడ్డలకు జన్మనిచ్చే ప్రాణి మరొకటి లేదు. పొట్టలో గుడ్లు పొదుగుతున్నప్పుడు
తల్లి కప్పలు ఆహారం తీసుకోవు. 6 – 7 వారాలకు పిల్లల్ని నోటి నుంచే బయటకి పడేసిన
తర్వాతే కప్ప ఆహారం తీసుకుంటుంది. ఈ కాలం అంత దాన్ని జీర్ణ వ్యవస్థ పని చేయడం
మానేస్తుంది. లోపల హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి కాదు. ఉదరం తాత్కాలిక గర్బంలా
పని చేస్తుంది. ఇంతటి అరుదైన ప్లేటిపస్ కప్పలు ఇప్పుడు కనిపించడంలేదు. ఇవి రెండు
రకాలుగా ఉండేవి. వీటిలో రియోబాట్రాచస్ విటేల్లినస్ కప్పలు చివరిసారి 1981లో కనిపించాయి. ఆర్. సైలాస్ జాతి కప్ప 1985 తర్వాత కనిపించడంలేదు. ఇవి
అంతరించిపోయాయి అని భావిస్తున్నారు. ప్లేటిపస్ కప్పల కోసం అప్పటి నుంచి విసుగూ
విరామం లేకుండా అన్వేషిస్తున్నారు. అయిన ఫలితం లేదు. ఇవి ఎందుకు అంతరించిపోయాయి అనే
విషయం అంతుపట్టడంలేదు.
కీటక
ప్రపంచంలో చీమలు తెలివైనవి. దాడి చేయడంలో, తిప్పికొట్టడంలో వాటికవే సాటి కాని
బంబార్దియర్ బీటిల్ వద్దకు వచ్చేసరికి చీమల తెలివి తేటలు ఎందుకూ పనికిరావు.
బంబార్దియర్ కీటకాలు ఒక పేలుడు సృష్టించి చీమల దిమ్మెరపోయేలా చేస్తాయి. చీమో,
సాలీడో బంబార్దియాన్ కాలిని పట్టుకుంటే సలసలకాగే రసాయనాలను తక్షణం వాటి మీదకు
వదులుతుంది. చల్లగా ఉండే ఓ కీటకప్రాణి అంత వేడి ఎలా సృస్టించగలుగుతుంది? బీటిల్
పొట్ట కింద వెనుకవైపు రెండు గ్రంథులు ఉంటాయి. ఒకో గ్రంధిలో రెండు గదులు ఉంటాయి.
లోపలి గదిలో హైడ్రోజన్ పెరాక్సైడ్, హైడ్రోక్వినోన్స్, బయటి గదిలో కెటలేస్, పెరాక్సిడేస్
ఉంటాయి. చీమలపై దాడికి సంకల్పం కలిగిన మరుక్షణమే లోపలి గది నుంచి కెమికల్స్
ఫోర్సుతో బయటి గదిలోకి వచ్చేస్తాయి. అక్కడ ఉండే పదార్థాలతో రసాయనిక చర్య జరిగి
అప్పటికప్పుడు బాంబు తయారవుతుంది. ఈ బాంబును బంబార్దియర్ తన పొట్ట వెనుక నుంచి
శత్రువు మీదకు పెల్చుతుంది. దీనితో రసాయనికి ఆవిరులు ఎంతో ఫోర్సుతో విడుదలవుతాయి.
వీటి తాకిడికి చీమలు ఇతర ప్రాణులు దిమ్మదిరిగిపోతాయి. అవి షాక్ నుంచి కోలుకునేలోపు
బంబార్దియర్ ఎగిరిపోతుంది. ఇలా రసాయనాల కలయికతో బాంబు తయారుచేసుకునే ప్రాణి
సృష్టిలో ఇదొక్కటే.
రెక్కల చేపలు
తమ ప్రపంచాన్ని వదిలి మరోలోకంలో విహరించాలని ఎవరికుండదు? కానీ,
ఈ శక్తి కొన్ని ప్రాణులకే సొంతం. పరిణామ క్రమంలో అలా రూపొందగలిగాయి. శత్రువుల బారి
నుంచి తమను తాము కావాడుకోవడానికి కొన్ని రకాల చేపలు, బల్లులు,
పాములు, ఉడతలు
ఎగిరే విద్య నేర్చాయి. అందుకు కావలసిన రీతిలో వాటి అవయవాలు మార్పులు చెందాయి.
ఉష్ణ మండల సముద్రాలలో కనిపించే ఒకరకం చేపలు ఆత్మరక్షణ కోసం నీటిలోంచి పైకొచ్చి అమాంతం గాల్లోకి ఎగిరి పారిపోతాయి. విశాలమైన తమ మొప్పలను రెక్కలగా ఉపయోగించుకుంటాయి. డాల్ఫిన్స్, షార్క్ చేపల వెంటబడినప్పుడు వేగంగా నీటి ఉపరితలానికి ఈదుతూ వస్తాయి. ఇలా గంటకు 32 కిలోమీటర్ల వేగంతో పైకి రాగానే, మొప్పలను రెక్కల్లా విప్పుకొని తక్షణం గాలిలోకి ఎగురుతాయి. కానీ వెంటనే నీటి మీదకు పడిపోతాయి. ఈ సారి తోకను సెకనుకు 50 సార్లు కదిలిస్తూ మళ్ళి గాల్లోకి ఎగురుతుంది. ఇలా నీటి రాన్ వే మీద గంటకి 65 కిలోమీటర్ల వేగంతో టేకాఫ్ అయినా గాలిలో ప్రయాణం చేయగలిగేది సాదారణంగా 40-50 మీటర్లే. గరిష్టంగా, ఓ ఎగిరే చేప 42 సెకన్ల పాటు 600 మీటర్ల దూరం గ్లయిడ్ చేసినట్లు జలచర పరిశీలకులు గుర్తించారు. 9 మీటర్ల ఎత్తు వరకు వెళ్ళగలవు. తుర్రుమని ఎగిరిపోయే ఈ మత్స్యవిహంగాలను పట్టుకోవడానికి డాల్ఫిన్స్ మరోవిధంగా ప్రత్నిస్తాయి. అవి ఎగిరే దిశలోనే శరవేగంతో ఈదుతూ, నీటి ఉపరితలం మీద తిరిగి వాలిపోగానే అమాంతం పట్టుకొని గుటుక్కున మింగేస్తాయి. ఇది ఎత్తుకు పై ఎత్తు అన్నమాట!
ఉష్ణ మండల సముద్రాలలో కనిపించే ఒకరకం చేపలు ఆత్మరక్షణ కోసం నీటిలోంచి పైకొచ్చి అమాంతం గాల్లోకి ఎగిరి పారిపోతాయి. విశాలమైన తమ మొప్పలను రెక్కలగా ఉపయోగించుకుంటాయి. డాల్ఫిన్స్, షార్క్ చేపల వెంటబడినప్పుడు వేగంగా నీటి ఉపరితలానికి ఈదుతూ వస్తాయి. ఇలా గంటకు 32 కిలోమీటర్ల వేగంతో పైకి రాగానే, మొప్పలను రెక్కల్లా విప్పుకొని తక్షణం గాలిలోకి ఎగురుతాయి. కానీ వెంటనే నీటి మీదకు పడిపోతాయి. ఈ సారి తోకను సెకనుకు 50 సార్లు కదిలిస్తూ మళ్ళి గాల్లోకి ఎగురుతుంది. ఇలా నీటి రాన్ వే మీద గంటకి 65 కిలోమీటర్ల వేగంతో టేకాఫ్ అయినా గాలిలో ప్రయాణం చేయగలిగేది సాదారణంగా 40-50 మీటర్లే. గరిష్టంగా, ఓ ఎగిరే చేప 42 సెకన్ల పాటు 600 మీటర్ల దూరం గ్లయిడ్ చేసినట్లు జలచర పరిశీలకులు గుర్తించారు. 9 మీటర్ల ఎత్తు వరకు వెళ్ళగలవు. తుర్రుమని ఎగిరిపోయే ఈ మత్స్యవిహంగాలను పట్టుకోవడానికి డాల్ఫిన్స్ మరోవిధంగా ప్రత్నిస్తాయి. అవి ఎగిరే దిశలోనే శరవేగంతో ఈదుతూ, నీటి ఉపరితలం మీద తిరిగి వాలిపోగానే అమాంతం పట్టుకొని గుటుక్కున మింగేస్తాయి. ఇది ఎత్తుకు పై ఎత్తు అన్నమాట!
360
డిగ్రీల దృష్టి
ఊసరవెల్లి ఏకకాలంలో అన్నివైపులా చూస్తుంది. ఎదురుగా ఆహారం కోసం వెతుకుతూనే, వెనక నుంచి పొంచ్చి ఉన్న శత్రువులను పసిగట్టగలదు. ఇదెలా సాధ్యం? దీనికి ఒళ్ళంతా కళ్ళు ఉండవు. మనలాగే రెండే ఉంటాయి. కాని కనుగుడ్డు దేనికదే అటూ ఇటూ తిరుగుతుంది. ఒక కన్ను పైకి చూస్తుంటే, మరొకటి ఎదురుగ్గా గాని, కిందకి చూస్తూ ఉంటుంది. ఏదైనా ఆహారపు పురుగు దృష్టిలో పడినప్పుడు మాత్రం రెండు కళ్ళు దానిమీదే చూపు కేంద్రీకరిస్తాయి. మరో విశేషం, ఊసరవేల్లిది బైనాక్యులర్ విజన్! ఈ చూపుతో లక్ష్యాన్ని సూటిగా గురిచూసి తన పొడవాటి నాలుకను బాణంలా విసురుతుంది. దీనికుందే జిగురుకు కీటకం అతుక్కుపోతుంది. మరుక్షణం నోటిలోకి గుటుక్కున మింగుతుంది.
Source: Discovery Magazine - 2006
మరిన్ని వివరాల కోసం Druvitha Science ను చూడండి






Comments
Post a Comment
Feel Free To Leave A Comment