Google's Sodar Tool Helps Android Users Maintain Social Distancing | Google Sodar | Druvitha Science
ఆరోగ్య సేతు, ఇది భారత ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అభివృద్ధి చేసిన కోవిడ్-19 ట్రాకింగ్ మొబైల్ అప్లికేషన్
కోవిడ్-19 (కరోనా వైరస్) గురించిన సమాచారాన్ని వ్యాప్తి చేయడం, భారతదేశంలోని ప్రజలకు ఆవశ్యకమైన ఆరోగ్య సేవల్ని అనుసంధానం చేయడం.
అలాగే కోవిడ్-19 ప్రమాదాల గురించి ప్రజలను హెచ్చరిస్తూ, ఉత్తమ పద్ధతులు, సలహాలు ప్రజలందరితోనూ పంచుకుంటుంది.
ఈ అప్లికేషన్ కరోన వైరస్ సంక్రామ్యతను ట్రాక్ చేయడం కొరకు ప్రపంచంలో ప్రస్తుతం మనమున్న స్థానాన్ని తెలుసుకునే వ్యవస్థ (GPS), బ్లూటూత్ వ్యవస్థలను ఉపయోగిస్తున్నారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్లలో ఆరోగ్య సేతు యాప్ అందుబాటులో ఉంది. బ్లూటూత్ సాంకేతికతను ఉపయోగించి, ఆరోగ్య సేతు భారతదేశం అంతటా తెలిసిన కేసుల డేటాబేస్ ద్వారా కోవిడ్-19 సోకిన వ్యక్తి సమీపంలో ఉంటే (ఆరు అడుగుల దూరం లోపు) ఆ వ్యక్తిని గుర్తించి హెచ్చరిస్తుంది. ఇంతేకాకుండా, మనం కోవిడ్-19 సోకిన ప్రాంతాలలో వున్నమా అనే విషయం గురించి కూడా హెచ్చరిస్తుంది. అని మనకు తెలుసూ.......
ఇదే తరహాలో గూగుల్ సంస్థ కుడా సోదర్ అనే ఒక వినూత్నమైన అప్లికేషన్ తీసుకొస్తుంది. ఇది మనల్ని సామజిక దూరం పాటించేలా చేస్తుంది. మనకు 1.5 మీటర్స్ పరిదిలోకి ఎవరైనా వస్తే బ్లూటూత్ సహాయంతో గుర్తించి హెచ్చరిస్తుంది.
ఈ అప్లికేషన్ కృత్రిమ మేధస్సు (artificial intelligence ) ద్వారా పనిచేస్తుంది
ఎలా వాడాలి?
1. మీ మొబైల్ క్రోమ్ బ్రౌజర్ ని ఉపయోగించి క్రింద ఇచ్చిన ఏదైనా ఒక లింక్ ని ఓపెన్ చేయండి
2. లాంచ్ అనే బటన్ నొక్కండి (Tap on ‘Launch’)
3. కెమెరా పర్మిషన్ అడుగుతుంది అన్నింటికీ అనుమతి ఇవ్వండి (Allow the permission)
4. ఇప్పుడు కెమెరా బటన్ ఓపెన్ చేయండి (Scan the ground)
5. మన చుట్టూ 2 మీటర్ల వలయం (రింగ్/సర్కిల్ ) కనిపిస్తుంది మనము ఆ వలయం దాటి బయటికి వేల్లకుడదని హెచ్చరిక చేస్తుంది (You will see a ring around you with a 2-meter radius)
గమనిక:
- ఈ అప్లికేషన్ అన్ని ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలో పనిచేయదు.
- Google ARCore Latest Updated అయిన ఫోన్లలో మాత్రమే పనిచేస్తుంది.
- ఒకసారి గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి Google Play Services for AR అని వెతికి అప్డేట్ చేసి చూడండి.
వీక్షకులకు గమనిక :
- సైన్స్ కి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఉంటే రాసి పంపండి. మీ పేరుతో ప్రచురణ చేస్తాం.
- మేము ప్రచురుణ చేసే వాటిలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని మాకు తెలియజేయండి. అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాము. మాకు మీ సలహాలు – సూచనలు అవసరం.
దృవిత సైన్స్ ను Follow అవ్వండి
మరిన్ని వివరాల కోసం Druvitha Science ను చూడండి

Good content bro. Iam suresh from golearner.in
ReplyDeleteOnce visit my website very useful information there is also. If you way ok both of us share back link our websites
Sure
DeleteExcellent comparison between two Tools...write how Arogya sethu App works exactly . ..
ReplyDeleteWrite on Masks and its merits and demerits.
For educational updates like career nd E-learning visist this page.
efasindia.com