వాట్సప్ లో ఫోన్ నెంబర్ సేవ్ చేయకుండ మెసేజ్ పంపడం ఎలా?|Druvitha Science



వాట్సప్ లో ఫోన్ నెంబర్ సేవ్ చేయకుండా మెజెస్ మరియు ఇతర ఫైల్స్ ఎలా పంపాలో తెలుసుకుందాం
           మన రోజు దినచర్యలో whatsapp ఒక భాగం అయినది అని మనకు తెలుసు. ఎందుకంటే ప్రతి రోజు ఈ whatsapp లో అనేక రకాల సమాచారాన్ని పంపుతున్న అలాగే తెలుసుకుంటున్నాము.
              
              మనలో ప్రతి ఒక్కరికి ఎదురవుతున్న  సమస్య ఏమిటంటే మన పక్క ఇంటి వారు లేదా ఎవరో ఒకరు వచ్చి మా వాళ్లకి ఈ ఫోటో పంపండి(అధార్, ఓటర్ ఐడి, మేమో మొ..) అని అడుగుతుంటారు. అప్పుడు మనము కాదనలేక వాళ్ళు చెప్పే ఫోన్ నెంబర్ మన ఫోన్ లో  సేవ్ చేసుకొని పంపుతాము. ఇలా అడిగిన ప్రతి ఒక్కరి నెంబర్ సేవ్ చేసుకోవడం ద్వారా అనవసరమైన ఫోన్ నెంబర్స్ మన ఫోన్లో ఎక్కువ అవ్వడం జరుగుతుంది. మనకు కావలసిన నెంబర్ సేవ్ చేసుకోవడానికి ఒకానొక సందర్బంలో వీలుకాదు.
కావున ఇప్పుడు మనము అనవసమైన లేదా ఒకేసారి అవసరమైయ్యే నెంబర్స్ ని మన ఫోన్లో సేవ్ చేయకుండ వాళ్లకి మెసేజ్,ఫొటోస్,వీడియోస్,ఆడియో ఫైల్స్ ఎలా పంపాలో తెలుసుకుందాం.

1.మన ఫోన్ లో ఉన్న whatsapp ఓపెన్ చేసి అందులో ఒకరిది(ఎవరిదైనా సరే)         ఓపెన్ చేయండి.


2. ఓపెన్ చేసి అక్కడ wa.me/91 మరియు పంపాల్సిన నెంబర్ టైప్ చేసి సెండ్        చేయండి.

          గమనిక:౦౦౦౦౦౦౦౦౦ ఉన్న దగ్గర మీకు కావలసిన నెంబర్ పెట్టండి

3. ఇప్పుడు మీకు క్రింది ఫోటోలో మాదిరిగా వస్తుంది దాని పైన ఒకసారి క్లిక్                 చేయండి.


4.మీరు పంపవలసిన నెంబర్ వస్తుంది. 
    ఇక ఏదైనా సెండ్ చేయవచ్చు(మెసేజ్,ఫొటోస్,వీడియోస్,ఆడియో ఫైల్స్)






మీ ఫ్రెండ్స్ కుడా ఈ సమాచారాన్ని షేర్ చేయండి

ఇలాంటి మరిన్ని సమాచారాల కోసం దృవిత సైన్స్ ను చూడండి

Comments