కరోన కొత్తగా 6 లక్షణాలు


Druvitha Science

కరోన కొత్తగా 6 లక్షణాలు

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సోమవారం కోవిడ్ -19 రోగులలో పదే పదే కనిపించిన నావెల్ కరోనా వైరస్  యొక్క ఆరు కొత్త లక్షణాలను వెల్లడించింది. కరోనా వైరస్ యొక్క లక్షణాలు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు మరియు జ్వరం అని మనందరికీ తెలుసు. కాని కరోనా కొత్తగా ఆరు లక్షణాలు కూడా బయటపడ్డాయని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పేర్కొన్నది.

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ విడుదల చేసిన ఆరు కొత్త లక్షణాలు

  1. చలి
  2. వణకడం
  3. కండరాల నొప్పి
  4. తలనొప్పి
  5. గొంతులో నొప్పి, మంట
  6. రుచి లేదా వాసన తెలియకపోవడం

బ్రిటన్ మరియు యునైటెడ్ స్టేట్స్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన సింప్టమ్ ట్రాకర్ ద్వారా సేకరించిన డేటా అధ్యయనం ప్రకారం, వాసన మరియు రుచిని కోల్పోవడం వంటి లక్షణాలతో కరోనా వైరస్ ఉందో లేదో చెప్పడానికి ఉత్తమ మార్గం అని పేర్కొంది. కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన 50 శాతం మంది రోగులు వాసన మరియు రుచిని కోల్పోతున్నట్లు నివేదించారు.
ఈ ప్రత్యేక లక్షణం మార్చి మధ్య నుండి కోవిడ్ -19 రోగులలో కనిపించింది.

సిడిసి వెబ్‌సైట్‌లోని లక్షణాల జాబితాలో ఇది చేర్చనప్పటికి కరోనా వైరస్ రోగులు అనుభవించిన లక్షణాలలో ఒకటి అలసట అని కూడా పేర్కొంది.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో నొప్పి మరియు పెదాలు నీలం రంగులోకి మారటం ఎమర్జెన్సీ కి సంకేతాలనీ ఒకవేళ ఈ లక్షణాలు కనబడితే వైద్య సహాయం కోరాలని సిడిసి సూచించింది.

దృవిత సైన్స్ ను Follow అవ్వండి

మరిన్ని వివరాలకు దృవిత సైన్స్ ను చూడండి

Comments

Post a Comment

Feel Free To Leave A Comment